మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీ వెనుక ఆ సినిమా ఉందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా మెగాస్టార్ గా దూసుకుపోతున్నాడు చిరంజీవి. ఇక చిరు త‌న‌ సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక తన ఫ్యాన్స్ కోరిక మేరకు చిరు 2008లో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. కానీ.. ఫలితం దక్కలేదు. అయితే.. రాజకీయాలకు సమస్య రాకూడదని కొన్నేళ్ళు సినిమాలకు కూడా దూరంగా ఉన్న చిరంజీవి.. ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలు గెలుపొందారు. కానీ.. ముఖ్యమంత్రి కావాలని కోరికతో చిరంజీవి పార్టీ పెట్టారని టాక్.

Prime Video: Muta Mestri

మెగాస్టార్‌కు రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఓ సినిమా కారణంగా వచ్చిందట. ఆ సినిమా చేసిన తర్వాతే.. అలాంటి కోరిక కలిగిందని.. గతంలో ఇంటర్వ్యూలో చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు.. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ముఠామేస్త్రి. ఈ సినిమాలో మార్కెట్‌లో ఓ కూలీ పాత్ర‌లో చిరు న‌టించాడు. కూలీగా పనిచేస్తూ ఏకంగా మంత్రి స్థాయికి ఎదుగుతాడు. ఇక ముఠామేస్త్రి సినిమా ప్రభావంతోనే చిరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సీఎంగా మారాలని అనుకున్నారట.

Megastar To Openly Talk Soon On Many Past & On-Going Issues Soon - The  Capital

అయితే పొలిటికల్ గా వర్కౌట్‌ కాకపోవడంతో సినిమాలే ముద్దని.. మళ్లీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చి.. ఖైదీ నెంబర్ 150తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న చిరంజీవి.. త్వరలోనే విశ్వంభర తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత మెగాస్టార్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల‌తో ఓ సినిమాను చేయ‌నున్నాడు. సినిమా అంతా కంప్లీట్ మెగాస్టార్ రోల్ పైన నడుస్తుందని సమాచారం. అయితే ఈ సినిమాల్లో ఒక్క హీరోయిన్ కానీ, డ్యాన్స్ స్టెప్స్ కానీ లేకుండా.. ఫుల్ ఇంటెన్స్ పాత్రలో మెగాస్టార్ కనిపించబోతున్నాడట.