సంధ్య థియేటర్ ఇష్యూ అల్లుఅర్జున్ అరెస్ట్.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏ 11 నిందితుడగా చూపిస్తే తెలంగాణ పోలీసులు బన్నీని అరెస్ట్ చేసి.. 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా హైకోర్టు మాత్రం స్పాట్‌లో మధ్యంతర బెయిల్ ఇచ్చి అల్లు అర్జున్‌ను రిలీజ్ చేయమంటూ ఆర్డర్స్ పాస్ చేసినా.. తెలంగాణ గవర్నమెంట్ జిమ్మిక్కులు చేస్తూ ఆ రోజు నైట్ జైల్లోనే బన్నీని ఉంచేసింది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ సాధించాడు. అనుకున్న విధంగానే బన్నీని రాత్రంతా జైల్లో నేల మీద నిద్రపోయేలా చేసి హాట్ టాపిక్ గా మారాడు.
వాళ్ళ మధ్య ఎలాంటి పర్సనల్ శత్రుత్వం లేకపోయినా.. ఎందుకు రేవంత్ రెడ్డి ఇలా చేశాడని జనాల మధ్యన గుసగుసలు కొనసాగుతున్న క్రమంలో.. సెలబ్రిటీస్ ముందడుగు వేసి అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు ఇంటికి క్యూ కట్టేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ చాలామంది అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ.. ఆయనను పలకరించారు. అయితే నాగార్జున మాత్రం బన్నీని పలకరించడానికి వెళ్లలేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ అంటే మొదటి నుంచి నాగార్జునకు చాలా స్పెషల్ బాండ్ ఉంది. ముఖ్యంగా చైతన్య నటించిన తండేల్ సినిమాకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నాగచైతన్య, అల్లు అర్జున్ ని పర్సనల్గా మీట్ అయ్యి మరీ పలకరించారు. కానీ.. నాగార్జున మాత్రం అల్లు అర్జున్‌ను కలవకపోవడంతో దీని వెనుక పెద్ద కారణమే ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. బన్నీని నాగార్జున కలవక పోవడానికి ఓ హీరోయిన్ మ్యాటర్ కారణమట. గతంలో వీళ్ళిద్దరి మధ్య ఓ హీరోయిన్ విషయంలో మిస్ అండర్స్టాండింగ్ వచ్చాయని.. సైలెంట్ వార్ కూడా జరిగిందని ఈ ఇష్యూ ని నాగార్జున ఇంకా మనసులో పెట్టుకొని అల్లు అర్జున్ అరెస్ట్ అయినా ఆయన పరామర్శించేందుకు రాలేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే నాగార్జున ఫోన్ కాల్ లో బన్నీని పరామర్శించాడని.. మరి కొద్ది రోజుల్లో వెళ్లి కలవబోతున్నాడని.. దీనిపై ఎలాంటి చెత్త రూమర్లు క్రియేట్ చేయకపోవడం మంచిదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.