ప్రభాస్ తన కెరీర్ లో లిప్ లాక్ ఇచ్చిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్‌ ఇండియన్ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్ట‌ర్‌ల‌నుంచి టాప్ నిర్మాతలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారంతా ఆసక్తి చెబుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సలార్, కల్కి తో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినాను చూపించాడు. కల్కితో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టిన రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఏ హీరోకు లేని విధంగా బిజీ లైన‌ప్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ సందడిగా గడిపేస్తున్నాడు.

Anushka Shetty opens up on relationship rumours with Prabhas, calls him '3  am friend' – India TV

ప్రస్తుతం ప్రభాస్.. మారుతి డైరెక్షన్లో రాజాసాబ్, హ‌ను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ, ప్రశాంత్ నీల్‌ కాంబోలో సలార్ 2, నాగ్ అశ్విన్‌ కాంబోలో కల్కి 2, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాలు చేయాల్సి ఉంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ వరస పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేస్తూ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న డార్లింగ్.. తన సినిమాల్లో ఎంత రాయల్‌గా కనిపిస్తాడో.. బయట అంతకంటే ఎక్కువ సింపుల్గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఫీదా చేస్తాడు. అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతున్నాడంటూ అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తాడు. అయితే ప్రభాస్ కు మొదటి నుంచి సిగ్గు చాలా ఎక్కువ. తన సినిమాలో నటించే హీరోయిన్లతో కూడా ఎక్కువ రొమాన్స్ సీన్లు చేయడానికి ఆయన మొహమాటపడుతూ ఉంటాడు.

Anushka Lip Lock Kiss With Prabhas - YouTube

అలాంటి ప్రభాస్.. తన సినీ కెరీర్ లో లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఒకరున్నారు. ఆమె ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క శెట్టి. వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కిన పాన్ ఇండియన్ మూవీ బాహుబలి సిరీస్ లో సెకండ్ పార్ట్ లో విరిద్ద‌రు లిప్ కిస్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. ఓరోరి రాజా.. వీరాధివీరా.. సాంగ్ చివరిలో వీరిద్దరూ ప్రేమను మరింతగా బలంగా చూపించేందుకు లిప్ లాక్ ప్లాన్ చేశాడు రాజమౌళి. అలా ప్రభాస్ లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్గా అనుష్క ఇమేజ్ దక్కించుకుంది.