అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగచైతన్య.. గతంలో స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించే వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలనీకే వీరిద్దరూ మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత చైతు మూడేళ్ల గ్యాప్ తో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకునే ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు.
గత కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న క్రమంలో.. వాటిని నిజం చేస్తూ శోభితను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు చైతు. ఇక ఈ ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే సింపుల్ సెట్స్ పై కేవలం 300 మంది సమక్షంలో వివాహం చేసుకొనున్నాడు. ఈ క్రమంలోనే శోభిత.. చైతన్యకు సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ వైరల్‌గా మారుతుంది. వారికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన తెగ ట్రెండింగ్‌గా మారుతుంది.
అలా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న నాగచైతన్య.. శోభితల వివాహాన్ని డాక్యుమెంటరీ రూపంలో రిలీజ్ చేయనున్నారని గత కొన్ని రోజులు వార్తలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సరికొత్త రూమర్టపై తాజాగా నాగచైతన్య టీం రియాక్ట్ అయ్యారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దంటూ తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం వీరి కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.