తారక్, చరణ్ లను అడ్డంగా ఇరికించిన అక్కినేని ఫ్యామిలీ.. కొత్త హెడేక్ షురూ..

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అక్కినేని ఫ్యామిలీ వల్ల కొత్త తలనొప్పి మొదలైంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ వల్ల‌ తారక్, చరణ్ కి అడ్డంకులా.. అసలు ఏం జరిగింది అనే సందేహం మీలో మొదలయ్యే ఉంటుంది. అక్కడికి వస్తున్నాం.. ఇండ‌స్ట్రీలోనే బ‌డా ఫ్యామిలీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం.. ఈ ఏడాది డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత‌ ధూళిపాళ్లతో గ్రాండ్ లెవెల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామందికి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఫ్రెండ్స్‌కు వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచేశారట‌. ముఖ్యంగా నాగచైతన్య, నాగార్జున‌ స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి.. అలాగే మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లి మరీ కార్డ్ ఇచ్చి స్పెషల్ గా ఇన్వైట్ చేశారట.

దీంతో ఇప్పుడు వీరిద్దరికి ఊహించని హెడేక్ ఎదురైంది. ఇద్దరు త‌మ‌ నెక్స్ట్ సినిమాల్లో నాగచైతన్య మాజీ భార్య సమంతతో కలిసి పని చేయనున్నారని వార్తలు గత కొంతకాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాగచైతన్య రెండో పెళ్లికి చరణ్ కానీ.. అటు తారక్ కానీ ఇద్దరిలో ఎవరు వెళ్లిన తమ నెక్స్ట్ మూవీ హీరోయిన్ అయినా సమంతకు మండిపోతుంది. వెళ్ళకపోతే ఇంటికి వచ్చి పిలిచినా సరే కనీసం పెళ్లికి హాజరు కాలేదాన్ని నాగార్జున వారిపై ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక.. చ‌ర‌ణ్ స‌త‌మ‌త‌మౌతున్నాడ‌ట‌. మరో పక్క తారక్‌కు కూడా దాదాపు ఇదే సిచువేషన్ అని తెలుస్తుంది.

ఇక తారక్‌కు ఉన్న అతి త‌క్కువ‌ మంది ఫ్రెండ్స్ లిస్టులో.. హీరోయిన్లలో సమంత, అలియా భట్ మొదటి వరుసలో ఉంటారు. ఇలాంటి క్రమంలో సమంత మాజీ భర్త చైతన్య పెళ్లికి తారక్‌ వెళితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచనలో పడ్డాడట. మరో పక్కన నాగచైతన్య కుటుంబానికి తారక్ తండ్రి హరికృష్ణకు విడుదీయ‌లేని బంధం ఉంది. నాగార్జున హరికృష్ణను ఇప్పటికే అన్నా అనే సంబోధిస్తూ ఉంటారు. అంత మంచి రిలేషన్షిప్ ఉన్న ఆయన ఇంటి పెద్ద కొడుకు పెళ్లికి వెళ్లకపోతే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో వీళ్ళిద్దరూ సిచువేషన్ పెద్ద హెడేక్ గా మారిందని.. వీరిద్దరి అడ్డంకులకు నాగార్జుననే కారణమంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక చివరకు వీళ్ళ డెసిషన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.