ఆర్య తో మొదలైన బ్యూటిఫుల్ జర్నీ.. పుష్ప 2తో ముగిసిందా.. బన్నీకి గుడ్ బై చెప్పేసినట్టేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలతో సంచలనం సృష్టించిన దేవి.. ఎన్నో కమర్షియల్ సినిమాలకు ఎనర్జీటిక్‌ ఆల్బమ్స్ కూడా అందించారు. చిరు, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలను మొదలుకొని వైష్ణవ తేజ్ లాంటి యంగ్ హీరోలతో సహా అందరి సినిమాల్లో తన మ్యూజిక్ తో సత్తా చాటుకున్నాడు. కానీ.. మొదటిసారి డిఎస్పి తన కెరీర్‌లో తీవ్రమైన వివాదంతో వార్తల్లో వైరల్ గా మారుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోను పనిచేసిన డీఎస్పీ.. ఎప్పటికీ మరిచిపోని కాంబో మాత్రం సుకుమార్ తోనే. ఆర్య సినిమా మొదలుకొని పుష్ప 2 వరకు సుకుమార్ తెర‌కెక్కించిన‌ ప్రతి సినిమాకు దేవిశ్రీ ని సంగీత దర్శకుడుగా వ్యవహరించాడు.

Clashes between Sukumar and DSP | cinejosh.com

సుకుమార్‌కు దేవి శ్రీ అంటే అంత గురి. ఇలాంటి సాలిడ్ కాంబినేషన్ కి వీళ్ళ ఫ్రెండ్‌షిప్‌కి పుష్ప 2తో బ్రేక్ పడిందంటూ ఇండస్ట్రీలో టాక్ న‌డుస్తుంది. చెన్నై ఈవెంట్‌లో డీఎస్పీ బహిరంగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిర్మాతలపై సెటైరికల్ కౌంటర్లు వేశాడు. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తన‌ను తప్పించి.. థ‌మన్‌ లాంటి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నారని.. ఇది అవమానంగా భావించిన డిఎస్పి అలా మాట్లాడాడ‌ని సమాచారం. పుష్ప 2 లాంటి భారీ సినిమాకు ఇలాంటి కఠిన నిర్ణయం మేకర్స్ తీసుకోవడం వెనుక సాంగ్స్, రీ రికార్డింగ్ విషయంలో దేవిశ్రీ చేసిన ఆలస్యమే కారణం అంటూ టాక్ నడుస్తుంది.

Allu Arjun, Sukumar, and DSP: The trio that redefined item songs - India  Today

ఇక ఏ చిన్న తప్పు జరిగినా.. వందల కోట్ల బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే.. డీఎస్పీని మేకర్స్ బిజిఎం ఆల్బమ్ నుంచి తప్పించారట. ఈ నిర్ణయం వల్ల.. డిఎస్పి బాగా హర్ట్ అయ్యారనే మ్యాటర్ చెన్నై ఈవెంట్లో డిఎస్పి చేసిన కామెంట్స్ తో క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ నిర్ణయంలో బన్నీ, సుకుమార్ ప్రమేయం కచ్చితంగా ఉండే ఉంటుంది. కానీ.. అంతటి స్టార్‌లని పబ్లిక్ గా డిఎస్పి కామెంట్స్ చేయలేరు. అందుకే నిర్మాతలను టార్గెట్ చేసి అలా మాట్లాడాడు. ఇక బన్నీ, సుకుమార్ విషయంలో కూడా డిఎస్పీ బాగా నిరాశగా ఉన్నాడట. ఇకపై అల్లు అర్జున్తో, సుకుమార్ తో కలిసి మరో సినిమాలో కలిసి పని చేసే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సుకుమార్ రియాక్ట్ అయితే గానీ ఓ క్లారిటీ రాదు.