అఖిల్ కి కాబోయే భార్య గురించి ఇవి తెలుసా.. ముందే ఓ పెళ్ళి కూడానా..?

మొన్నటి వరకు అక్కినేని హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి వార్తలు హాట్ టాపిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చిన్న కొడుకు అఖిల్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా అఖిల్, జైనబ్‌ల ఎంగేజ్మెంట్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. సడన్‌గా అఖిల్ – జైనబ్‌ను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అమ్మడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆమె ఏం చేస్తుంది.. ఇలా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ఆడియన్స్ మొదలయ్యాయి.

Nagarjuna's son Akhil Akkineni engaged to Zainab Ravdjee

అయితే ఈ క్రమంలోనే అఖిల్ కాబోయే భార్యకు సంబంధించిన షాకింగ్ విషయం కూడా వైరల్ గా మారుతుంది. జైనబ్ కు అఖిల్ కంటే ముందే వేరొక వ్యక్తితో పెళ్ళి అయ్యిందని రూమర్ ట్రెండ్ అవుతుంది. కానీ.. ఆ రూమర్ల వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. ఇక అఖిల్ కి కాబోయే భార్య థియేటర్ ఆర్టిస్ట్.. అలాగే పెయింటర్ గాను వ్యవహరిస్తోంది. అంతేకాదు.. అఖిల్ కంటే జైన‌బ్ 9 సంవత్సరాలు పెద్దదట. ఇక జైన‌బ్ తండ్రి జుల్ఫీ రావ‌డ్జీ కి.. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మధ్యన మంచి బాండింగ్ ఉందని టాక్‌.

Zainab Ravdjee : r/BeautifulIndianWomen2

అలాగే జుల్ఫీకు.. జగన్ సీఎం గా ఉన్న టైంలో క్యాబినెట్ ర్యాంక్ గ‌ల్ఫ్ దేశాల‌లో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చి మరి సత్కరించారట. ఇక నాగార్జున జైనబ్‌ తండ్రి మధ్యన కూడా వ్యాపార లావాదేవీలు చాలానే ఉన్నాయని.. వారిద్దరి ముందునుంచి బిజినెస్ వ‌ల్ల మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడిందని.. ఈ క్రమంలోనే బిజినెస్ పార్టనర్స్‌ కాస్త వియంకులుగా మారిపోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోనున్నారని టాక్‌. మరో పక్కన నాగచైతన్యతో పాటే ఒకే వేదికపై అఖిల్ పెళ్లి కూడా జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.