టాలీవుడ్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్ పై రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు మేకర్స్. డిసెంబర్ 4న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. పుష్ప బ్లాక్ బస్టర్ అయిన క్రమంలో.. పుష్ప 2తో ఎలాగైనా మరోసారి సక్సెస్ అందుకోవాలని.. ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మేకర్స్. దీనికోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే అల్లు అర్జున్.. ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడని అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదట్లో లిస్టులో అట్లీ పేరు వినిపించిన రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందట. ఇక తాజాగా పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగిన సంఘటన తెలిసిందే. ఇందులో స్వచ్ఛమైన తమిళ్లో మాట్లాడి బన్నీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో స్పెషల్ గెస్ట్ గా తమిళ్ ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ హాజరై సందడి చేశారు. ఇటీవల రజనీకాంత్ జైలర్‌తో తెలుగులో సక్సెస్ అందుకున్న నెల్సన్.. జైలర్ 2 పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. అయితే అల్లు అర్జున్‌తో నెల్సన్ ఓ సినిమా చేయనున్నాడట. కథ కూడా ఆయనకు వినిపించినట్లు సమాచారం. అయితే స్టేజ్ పై నెల్సన్ బన్నీకి కథ చెప్పాలంటే ముందుగా ఆలోచించానని.. నాకు తెలుగు రాదు. కానీ.. ఇప్పుడు అల్లు అర్జున్ తమిళ్లో మాట్లాడడం చూస్తే నేనే షాకయ్య.
ఖచ్చితంగా ఆయనకు కథ చెబుతాను అంటూ వెల్లడించాడు. దీనికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తంసప్ సింబల్ చూపించాడు. వాస్తవానికి ప్రశాంత్ నీల్ తర్వాత తారక్ తో దిలీప్ సినిమా చేయాల్సి ఉంది. కథ చెప్పడం కూడా పూర్తయింది. సితార బ్యానర్ లో ఈ సినిమాను చేయనున్నారని టాక్. అయితే అల్లు అర్జున్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో.. దిలీప్ కుమార్ తన నెక్స్ట్ మూవీ బన్నీతో చేస్తాడా.. లేదా తారక్ తో తతెరకెక్కిస్తారా అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో బన్నీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది పూర్తి అయిన వెంటనే దిలీప్ కుమార్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తారక్‌ఖు హ్యాండిచ్చి.. దిలీప్ బన్నీతో సినిమా చేస్తాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.