స్లో పాయిజన్ల ఎక్కేస్తున్న దేవి శ్రీ.. బుజ్జి తల్లి సాంగ్.. సెన్సేషన్ క్రియేట్..

అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటిస్తున్న మూవీ తండేల్. చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ సినిమా చందుమొండేటి దర్శకత్వంలో తెర‌కెక్క‌నుంది. కార్తికేయ సినిమాతో ఫీలిమ్‌ ఇండస్ట్రీకి పరిచయమైన చందు.. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా.. మరో పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. బన్నీవాస్ ప్రొడ్యూసర్‌గా వివరిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఎస్.పి సంగీతమందిస్తున్నాడు. ఈ క్రమంలోనే తండేల్‌ మూవీ నుంచి ఐదు రోజుల క్రితం బుజ్జి తల్లి సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Bujji Thalli From Thandel: Love Song Of The Year

ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. రిలీజ్ అయిన వెంటనే రిసల్ట్ రాకపోయినా.. మెల్లమెల్లగా దేనికి హ్యూజ్‌ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఓ రియల్ ఇన్స్టెంట్ ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. ఎమోషనల్ గా ఆడియన్స్‌ను కనెక్ట్ చేసింది. ఇదివరకే సాయి పల్లవి, చైతన్య జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ సినిమాలో నటించి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మళ్లీ వీరు ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాల్లో.. నాగచైతన్య ఉత్తరాంధ్ర యాసలోనే కనిపించ‌నున్నాడు.

మొదటిసారి ఇలాంటి క్యారెక్టర్ లో చైతు నటించడంతో ఆడియన్స్ లో ఆసక్తి నెలక్కొంది. ఈ సినిమా వర్కౌట్ అయితే చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లస్ అవుతుందన్నడంలో అతిశయోక్తి లేదు. అయితే ఓ సినిమా సక్సెస్ కు మ్యూజిక్ ఎలాంటి కీ రోల్‌ ప్లే చేస్తుందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన బుజ్జి తల్లి పాట ఆడియన్స్‌లో స్లో పాయిజన్‌లా ఎక్కుతుంది. డిఎస్‌పి సంగీతం.. ప్రేక్షకులను విప‌రీతంగా ఆకట్టుకుంటుంది. దేవి మాస్ బీట్స్‌ ఎలా ఇస్తాడో.. క్లాస్ వచ్చిన సాంగ్స్ ని కూడా అదే రేంజ్ లో కంపోజ్ చేసి తన సత్తా చాటుకుంటాడు. ఈ క్రమంలోనే డిఎస్పి కెరీర్‌లో ఎన్నో మెలోడీ సాంగ్స్ రూపొందించాడు. ఇప్పుడు అదే లిస్టులో బుచ్చి తల్లి సాంగ్ కూడా యాడ్ అయిపోతుంది. ఇప్పటికే 10M+ పైగా వ్యూస్ సంపాదించుకున్న ఈ సాంగ్.. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఇన్‌స్టా రీల్స్‌లో ఎక్కడపడితే అక్కడ ఇదే సాంగ్ వైరల్ గా మారుతుంది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.