సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరైనా సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటున్నారు అంటే వారికి కాబోయే వధువు ఎవరు.. లేదా వరుడు ఎవరు.. వాళ్ళు బ్యాగ్రౌండ్ ఏంటి.. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి.. ఏం చేస్తూ ఉంటారు.. అని తెలుసుకోవాలని ఆసక్తి ఇండస్ట్రీలో వారి దగ్గర నుంచి సాధారణ ఆడియన్స్ వరకు అందరిలోనూ ఉంటుంది. ఇక అలాంటిది.. ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీలో ఒకటైన అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్‌కు కాబోయే భార్య అంటే.. ఆమె ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి కచ్చితంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ అక్కినేని అఖిల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న జైనబ్ రావిడ్జి ఎవరు.. ఆమె ఏం చేస్తుంది.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. తెలుసుకోవాలని సెర్చింగ్లు మొదలైపోయాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జైనబ్ తండ్రి జుల్ఫీ రావెడ్జి అని తెలుస్తుంది. ఆయన గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుడుగా పనిచేశాడట. అంతేకాదు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా.. ఎన్నో సేవలను అందించాడట. ఇక అటు జగన్‌తో పాటు.. ఇటు నాగార్జున కుటుంబంతో వీరికి మొదటి నుంచే మంచి బాండింగ్ ఉందని సమాచారం. అయితే ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే.. అఖిల్ కంటే జైనబ్ రావిడ్జ్ 9 సంవత్సరాలు పెద్ద అమ్మాయి అట.
ప్రస్తుతం జైనబ్ ఏజ్ 39 ఏళ్ళు అని.. అఖిల్ వయసు 30 ఏళ్ళు అని సమాచారం. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు యేజ్‌తో సంబంధం లేకుండా పెళ్లిళ్లు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు అందులో పెద్ద ఆశ్చర్యమేముంది అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఇక జైనబ్ గతంలో మీనాక్షి అనే సినిమాతో వెండితెరపై ఆర్టిస్ట్ గా కూడా మెరిసిందట. గతంలో హైదరాబాద్‌లో రిఫ్లెక్షన్ పేరుతో కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను పెట్టిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటుంది. ఆమె ఎక్కువగా లండన్, దుబాయ్, ఇండియా లాంటి దేశాలకు విహారాలు చేస్తూ ఉంటుందని.. తన ఇన్‌స్టా చూస్తే అర్థమవుతుంది.