టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అక్కినేని ఫ్యామిలీకి.. ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య పెళ్లి వార్తలు గత కొంతకాలంగా తెగ వైరల్ గా మారుతున్నాయి. దానికి తగ్గట్టుగానే.. తాజాగా చైతన్య సోదరుడు మరో హీరో అక్కినేని అఖిల్ కూడా జైనబ్ అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకొని ఆడియన్స్ కు సాడన్ ట్రీట్ ఇచ్చాడు.
ప్రస్తుతం చైతూ – శోభితలతో పాటు.. అఖిల్ – జైనబ్‌ల పెళ్ళి వార్తలు కూడా ట్రెండింగ్ గా మారాయి. అఖిల్ కు సంబంధించిన ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. కాగా నాగచైతన్య – శోభితల వివాహం ఈ ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుందని ఇప్పటికే నాగార్జున అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ లో అయితే తన తండ్రి ఏఎన్ఆర్ ఆశీస్సులు కూడా ఉంటాయని నమ్మకంతో అక్కడ చేస్తున్నామని.. హిందూ సంప్రదాయ ప్రకారం ఈ పెళ్లి జరగబోతుంది అంటూ వెల్లడించాడు.
అయితే ఆజాగా అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు అఖిల్ పెళ్లి కూడా నాగచైతన్య పెళ్లి రోజునే అదే వేదికపై జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ అక్కినేని బ్రదర్స్ ఇద్దరు అన్నపూర్ణ స్టూడియోస్ లో అదే వేదికపై వధూవరుల కుటుంబాల సమక్షంలో అతి తక్కువ మంది గెస్ట్ల మధ్యన సింపుల్గా వారి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ.. ఒకవేళ నిజంగానే ఈ అక్కినేని వారసుల ఇద్దరు పెళ్లి ఒకే రోజున ఒకే వేదికపై జరిగితే మాత్రం.. ఫ్యాన్సులో పండగ వాతావరణం నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.