సౌత్ టాప్ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ రెమ్యున‌రేష‌న్‌లోను టాపే.. ఒక్క సినిమాకు ఎంతంటే..?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వారిలో ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ పేర్లు కూడా వినిపిస్తూనే ఉంటాయి. ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ ఇద్దరు డైరెక్టర్ చాలామంది దర్శకులతో పోలిస్తే అతి తక్కువ సమయంలోనే సక్సెస్ రేట్ ను పెంచుకున్నారు. అయితే ప్రస్తుతం సౌత్ టాప్‌ స్టార్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న ఈ ఇద్దరు.. రెమ్యూనరేషన్లు కూడా టాప్ లెవెల్ లో తీసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు డైరెక్టర్స్ ఒక్క సినిమాకు రెమ్యున‌రేషన్ ఎంతో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ప్ర‌శాంత్ నీల్‌ ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇక ప్రశాంత్ వర్మ సినిమాకు రూ.20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్‌ చేస్తున‌ట్లు స‌మాచారం.

The Godfather, Scarface And Ram Gopal Varma Films Have Majorly Influenced  Me: Prashanth Neel

అయితే ఈ ఇద్దరు డైరెక్టర్స్ అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో త‌మ సినిమాలు తెర‌కెక్కిస్తు పాన్ ఇండియా లెవెల్ స‌క్స‌స్ అందుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు చేస్తున ఓ కామన్ మిస్టేక్‌తో వీరి కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇంతకీ ఆ కామన్ మిస్టేక్ ఏంటి అనుకుంటున్నారా.. ఇతర డైరెక్టర్ల దర్శకత్వంలో తెర‌కెక్కించే సినిమాలకు కూడా కథలను అందించడం వల్ల వీళ్ళ బ్రాండ్ వ్యాల్యూ మెల్లమెల్లగా తగ్గుతుంది. తాజాగా ప్రశాంత్ నీల్‌.. భ‌ఘీర సినిమాతో షాకింగ్ రిజల్ట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథను అందించారు. దీనివల్ల ఆయన రేపిటేషన్ కాస్త తగ్గింది.

Prashanth Varma

అంతేకాదు ఇక ప్రశాంత్ వర్మ దేవకి నందన వాసుదేవ సినిమాకు తన కథను అందించారు. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ కూడా షాకింగ్ రిజల్ట్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ ఇద్దరు డైరెక్టర్లు ఇకనైనా కథల విషయంలో.. కథలను అమ్ముకునే విషయంలో మారాలని.. లేదంటే కెరీర్ పరంగా ఇబ్బందులు తప్పవంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ కోట్లల్లో సంపాదిస్తున్న.. మరో పక్కన తమ కథలను అమ్ముకొని మరింత డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారే తప్ప‌.. ఆ సినిమాలో ఫెయిల్ అయితే వారి మార్కెట్ మారింత‌గా తగ్గుతుందని ఆలోచన చేయ‌లేక పోతున్నారు. ఇక నైనా వీళ్ళు ఈ విష‌యంలో త‌గ్గిన జగ్ర‌త‌లు తీసుకుంటారో లేదో.. వేచి చూడాలి.