నాన్న చిరును సైడ్ చేసి… బాల‌య్య‌తో సై అంటోన్న రామ్‌చ‌ర‌ణ్‌..?

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్క‌నున్న తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై.. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా సినిమా నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీ కనిపించనుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు.. సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్లు ఒకరైన దిల్ రాజు అఫీషియల్‌గా ప్రకటించాడు. మొదట క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నామని కానీ.. సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నాం. క్రిస్మస్ కంటే సంక్రాంతి అయితే బాగుంటుందని నాతో పాటు.. మిగతా ఇండస్ట్రీల డిస్ట్రిబ్యూటర్లు భావించారు.

Ram Charan Unveils New 'Game Changer' Poster On Ganesh Chaturthi; Announces  New Song Release This Month - News18

వెంటనే ఈ ఆలోచనలు చిరంజీవి గారికి, యూవి క్రియేషన్ వాళ్లకు తెలియజేశాం. మూడేళ్లుగా గేమ్ ఛేంజ‌ర్ భారీ బడ్జెట్లో రూపొందింద‌ది. ఇక మీరు రూపొందిస్తున్న విశ్వంభ‌ర‌ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. సంక్రాంతికి వస్తున్నట్లు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అందుకే సంక్రాంతికి మా సినిమాకు కూడా డేట్ కావాలని చిరంజీవిని, యూవి క్రియేషన్స్ వాళ్ళని అడిగాం. వాళ్ళు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. గేమ్ ఛేంజ‌ర్‌ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి వాళ్ళు విశ్వంభ‌ర ను మరో రిలీజ్ డేట్ కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక విశ్వంభ‌ర ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ సహా ఇత‌ర స‌నులు పూర్తి చేసి రిలీజ్‌కు సిద్ధమైంది. నాకోసం, మా సినిమా కోసం వాళ్ళు ఈ సహాయం చేయడం చాలా గొప్ప విషయం. దీనికి చిరంజీవి గారికి, యూవి క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కిలకు నా ధన్యవాదాలు అంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చాడు.

Fresh buzz on NBK 109's second glimpse | Latest Telugu cinema news | Movie  reviews | OTT Updates, OTT

ఇక గేమ్ ఛేంజ‌ర్‌ సంక్రాంతిలో రిలీజ్ చేస్తున్నామంటూ వివరించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మూడు సాంగ్స్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయని.. మరో మూడు పాటలను సినిమా రిలీజ్ లోపు మెల్లమెల్లగా అప్డేట్ ఇస్తామని. ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ప్లాన్ చేశామని దిల్ రాజు వివరించాడు. ఇక గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ కు.. గ్లోబల్గా ఈ మూవీ ఉండిపోయేలా సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. సంక్రాంతికి కలుద్దాం అంటూ దిల్ రాజు అఫీషియల్ గా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో చిరంజీవి విశ్వంభ‌ర‌ వాయిదాపడి కొడుకు గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా రానుంది. ఇక సంక్రాంతి భ‌రిలోనే బాలయ్య ఎన్బికె 109 తో ఆడియన్స్ ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నాన్న చిరున సైడ్ చేసి.. చరణ్ బాలయ్యతో తలపడడానికి సిద్ధమవుతున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య, చరణ్ మధ్య పోటీ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.