ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర పేరు మారుమోగిపోతుంది. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య ప్లాప్ తర్వాత ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల.. ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో.. అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్లలో సినిమా చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్లు కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇక గతంలోనే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై సరికొత్త రికార్డులు దేవర సృష్టించిన సంగతి తెలిసిందే. అమెరికా బిగ్గెస్ట్ రికార్డ్ బుకింగ్స్ బెనిఫిట్షోతో సంచలనం సృష్టించిన దేవర.. మరోసారి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన రెండో హీరోగా ఎన్టీఆర్ ఇమేజ్ను దక్కించుకున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలుగా 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను నార్త్ అమెరికాలో దక్కించుకున్న హీరోలలో రెండో హీరోగా తారక్ నిలిచాడు. తారక్ నటించిన ట్రిపుల్ ఆర్, దేవర ఈ ఘనతను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ ఘనతను సాధించిన మొదటి హీరో.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. సలార్, కల్కి 28 సినిమాలతో ప్రభాస్ ముందు వరసలో నిలువగా.. ఎన్నో అంచనాల నడుమున రిలీజ్ కానున్న దేవర మూవీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.