రేణూ దేశాయ్ రెండో పెళ్లి ఆ ఒక్క కార‌ణంతోనే చేసుకోలేదా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి పరిచయాలు అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఒక తల్లిగా మంచి పేరు సొంతం చేసుకుంటూనే మరొకవైపు మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా, సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా కూడా పేరు దక్కించుకుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది కూడా .. నిశ్చితార్థం కూడా చాలా గ్రాండ్ గా చేసుకుంది.. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా ఆ పెళ్లిని రద్దు చేసుకొని ప్రస్తుతం పిల్లలతో గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.

దీని కారణాన్ని ఇటీవల ఆమె చెబుతూ.. నా తల్లిదండ్రులు నేను అమ్మాయిగా పుట్టడంతో చాలా బాధపడ్డారు.. మా నాన్న అయితే మూడు రోజులు నన్ను తాకలేదు కూడా.. పేరెంట్స్ ఉండి కూడా వారి ప్రేమను నేను పొందలేకపోయాను. ఇక విడాకులు ప్రకటించిన తరువాత నా పేరెంట్స్ కూడా నన్ను దగ్గరికి తీసుకోలేదు. అది నన్ను మరింత బాధ పెట్టింది .ఇక నాలాగే నా పిల్లల జీవితం కూడా కాకూడదని రెండో పెళ్లి కి నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కూడా అతడితో మాట్లాడి క్యాన్సిల్ చేసుకున్నాను అంటూ తెలిపింది రేణు దేశాయ్.

ప్రస్తుతం పిల్లలతో ముంబైలో కలిసి ఉంటున్న ఈమె విడాకుల తర్వాత 17 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలకపాత్ర పోషించింది.