మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాల్లో హీరోగా కెరీర్ ప్రారంభించిన విశ్వక్.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. కొంతకాలం గ్యాప్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విశ్వక్.. ప్రస్తుతం వరుస సినిమా అఫర్‌లను అందుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ సినిమాల్లో కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా నెటింట వైరల్ అవుతాడు. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడే స్వభావమే విశ్వక్ కెరీర్‌లో కాంట్రవర్సీలకు కారణమవుతుంది. అయితే తాజాగా ఏవో కాంట్రవర్సీల కారణంగానే తన ఇన్‌స్టా పేజ్‌ను తొలగించాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విశ్వక్‌కు సంబంధించిన మూవీ పోస్టర్ నెటింట తెగ వైరల్‌గా మారింది.
ప్రస్తుతం విశ్వక్ మెకానిక్ సినిమాతో ప్రేక్షకులు పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతోపాటు మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీ బిజీగా గడుపుతున్న ఈ యంగ్ హీరో తాజాగా కొత్త సినిమాను ప్రారంభించాడు. గతంలోనే లైలా టైటిల్ తో సినిమాను నటిస్తున్నట్లు విశ్వక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమాలో ఫస్ట్ టైం అమ్మాయి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటివరకు టాలీవుడ్ లో మాస్ క్యారెక్టర్స్‌లో దూసుకుపోయిన విశ్వక్.. మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అయితే నేడు సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకున్న మేకర్స్ త్వరలోనే షూటింగ్ మొదలుకానున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇక ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తుంది. ఈ క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విశ్వక్ అమ్మాయి గెటప్ లో అదరగొట్టాడు. ఈ పిక్ చూస్తుంటే ఓ అందమైన అమ్మాయి క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ లుక్ అనిపిస్తుంది. కేవలం ఫేస్ లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న మేకర్స్.. ఈ సినిమాను వచ్చే ఏడాది వాలెంటెన్స్ డే ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటింట తెగ వైరల్ అవడంతో లైలా భలే క్యూట్గాగా ఉన్నావ్ అంటూ.. నిజంగా అమ్మాయి లాగే అనిపిస్తున్నావ్ అన్న నీ లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.