స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. కాల్ చేసి ఒక్క రోజులో 17 సినిమాలు క్యాన్సిల్‌..?

సినీ ఇండస్ట్రీలో మొదటినుంచి ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు చాలా కామ‌న్. ఇటీవల కాలంలో ఇవి మరింతగా వినిపిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు ఎంత ఘనంగా వివాహం చేసుకున్నా అవి పెద్దగా హైలెట్ కావు. అదే ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తులు, స్టార్ సెలబ్రెటీల వివాహం అంటే అది మీడియాకు పెద్ద వార్త. ఇప్పుడైతే కాస్తో కూస్తో పరవాలేదు కానీ.. గతంలో పెళ్లయిన హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మరో హీరోయిన్ తో ప్రేమలో పడి మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవడం. వేరెవాళ‌ను రెండో వివాహం చేసుకోవడం లాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం.

ఇదే దారిలో ఎన్టీఆర్ కూడా రెండో పెళ్లి చేసుకోవాలని గతంలో భావించారట. అప్పటి హీరోయిన్ కృష్ణకుమారిని ఎంతగానో ప్రేమించారట. ఇక ఆ సమయానికి ఎన్టీఆర్‌కు పెళై అప్పటికే 13 మంది పిల్లలు ఉన్నారు. అప్పటివరకు ఎన్టీఆర్ తో ఇండస్ట్రీలో 47 మంది హీరోయిన్లు మాత్రమే పని చేశారు. అందులో జమున ఏకంగా 36 సినిమాల్లో హీరోయిన్గా కనిపిస్తే.. సావిత్రి 26, అంజలి 26, కృష్ణకుమారి 25 సినిమాల్లో మెప్పించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో కృష్ణకుమారి బంధం చాలా గట్టిగా ఉండేదని.. పెళ్లి వరకు వీళ్ళు వెళ్లారని.. అయితే చివరి రోజు ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు అప్పటి మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

కానీ వారి పెళ్లి ఆగిపోవడానికి కారణం మాత్రం తెలియదు. ఇక ఎన్టీఆర్ తో పెళ్లి అని ఎన్నో అసలు పెట్టుకున్న కృష్ణకుమారి.. అది జరగకపోవడంతో షాకింగ్ డెసిషన్ తీసుకుందట. కృష్ణకుమారి కోపంలో ఇండస్ట్రీని వదిలి దూరంగా వెళ్లిపోయిందట. ఆ సమయంలో 17 సినిమాలు ఒప్పుకున్న ఆమె.. ఒక్క రోజులోనే సినిమాల దర్శక, నిర్మాతలకు ఫోన్ చేసి ఒప్పుకున్న సినిమాలన్నీ క్యాన్సిల్ చేసి.. డబ్బులను కూడా వెనక్కు పంపేసిందట.