మహేష్ కు ఇలాంటి చెత్త సినిమాలు చేయొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొలిటిషన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్లు అందుకని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన కెరీర్‌లోను అతిథి, సైనికుడు, ఖలేజా, ఆగడు, బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అలాగే మురారి, ఒకడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే మన టాలీవుడ్ హీరోస్ చాలామంది పాన్ ఇండియా అంటూ అటువైపుకు వెళ్ళిన.. మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు లోకల్ సినిమాలోనే చేస్తూ వచ్చాడు. సరైన కథ దొరికే వరకు ఎలాంటి పాన్‌ ఇండియన్ సినిమాలకు ఒప్పుకోని మహేష్.. జక్కన్న చెప్పిన కథతో ప్రస్తుతం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు.

Mahesh Babu called the 'nicest superstar' by Minister KTR on his birthday |  Telugu Movie News - Times of India

ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ ఏడాది ఎండింగ్లో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే సినిమా కోసం మహేష్ మేకోవర్ అవుతున్నాడు అంటూ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే మహేష్ హెయిర్ స్టైల్ కూడా మార్చి హాలీవుడ్ స్టార్ రేంజ్‌లో కనిపిస్తున్నారు. ఇక మహేష్ కెరీర్‌లో తన సినిమాలు చూసి రివ్యూ చెప్పే వారిలో తండ్రి కృష్ణ మొదటి ఉండేవారని.. ఆయన చాలా పెద్ద క్రెటిక్ బాగోలేకపోతే ముఖంపైనే బాగోలేదని చెప్పేసేవారు. ఆయన బాగుందని చెబితే కచ్చితంగా ఆ సినిమా అద్భుతంగా ఉంటుందని మేము భావించే వాళ్ళమ‌ని మహేష్ ఓ సందర్భంలో వివరించాడు. అయితే తన ఫాదర్ కాకుండా మహేష్ కు రివ్యూ ఇచ్చే మరో వ్యక్తి ఉన్నారట‌. ఆయన ఓ పొలిటిషన్ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్. త‌న ప్రతి సినిమా ఆయన కచ్చితంగా చూస్తారని.. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా.. తన సినిమాను చూసి ఆయన మూవీకి రివ్యూ ఇస్తూ ఉంటాడని చెప్పుకొచ్చారు.

Aagadu telugu Movie - Overview

ఆయన రివ్యూ ఏం చెబుతాడో అని నేను భయపడుతూ ఉండేవాడిన‌ని వివరించాడు. ఇంతకీ ఆ పొలిటిషన్ మరెవరో కాదు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. మహేష్, కేటీఆర్ మంచి స్నేహితులన్న‌ సంగతి తెలిసిందే. వారిద్దరు ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు. అయితే ఆగడు సినిమా చూసి కేటీఆర్.. మహేష్ కు ఫోన్ చేశాడట. ఆయన రియాక్షన్‌కు మహేష్ షాక్ అయ్యారట. ఓ రకంగా భయపడ్డారట‌. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ ఓ సందర్భంలో వివరించాడు. ఏంటి మహేష్ ఇలాంటి చెత్త సినిమాలను ఎప్పుడూ చేయొద్దు అంటూ మొఖం మీదనే అనేసారాట‌. దాంతో మహేష్ చాలా ఫీలయ్యారట. అప్పటి నుంచి కేటీఆర్ తన సినిమాలు చూస్తే తనకు టెన్షన్ అని.. ఎందుకంటే బాగుంటేనే బాగుందని చెబుతారు. లేదంటే అసలు ఆలోచించకుండా మొఖం మీదే ఇలా చెత్త సినిమా అంటూ వార్నింగ్ ఇచ్చేస్తాడని.. ఆయనకు చాలా భయమట. అంత నిజాయితీగా సినిమాల గురించి చెప్పే మంచి స్నేహితుడు కేటీఆర్ అంటూ మహేష్ వివరించాడు.