సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఇద్దరే ఇద్దరు హీరోయిన్ల పేర్లు, త్రిష నయనతార . సెకండ్ ఇన్నింగ్స్ లోను తమదైన స్టైల్ లో దున్నేస్తున్నారు . ఆశ్చర్యం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ లోను ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా మించిన రేంజ్ లో హై రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నయనతార ఒక్కొక్క సినిమాకి పది నుంచి 12 కోట్ల రెమ్యూనిరేషన్ ఛార్జ్ చేస్తూ ఉండగా.. త్రిష కూడా ఆ లిస్టులోకి వచ్చేసింది . దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు తన సినిమాలకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట .
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష పలు సినిమాలలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తూ ఉండడం గమనార్హం. కాగా ఈ మధ్యకాలంలో హీరోయిన్ త్రిష హీరోయిన్ నయనతార ల పేర్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో మారు మ్రోగి పోతున్నాయి . నయనతార ఆఫర్స్ త్రిష దొబ్బేస్తుంది అని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిష తనకు నయనతారకు మధ్య విభేదాలు ఉన్న విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది .
గతంలో ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ ..”నాకు నయనతారకు మధ్య ఉన్న విభేదాలు నిజమే ..కానీ అవి వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదు .. కొన్ని పర్సనల్ వి.. సమయం గడిచే కొద్దీ మేము ఒకరినొకరు అర్థం చేసుకున్నాము.. ఇప్పుడు మా మధ్య ఎలాంటి క్లాషెస్ లేవు .. మంచి ఫ్రెండ్స్ అయిపోయాం..”అంటూ చెప్పుకొచ్చింది. అయితే సినిమాల పరంగా మాత్రం వీళ్ళిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంటూ ఉండడం గమనార్హం . మొత్తానికి నయనతార త్రిషలకు ఏదో బాగానే చెడినట్లు ఉంది అంటున్నారు జనాలు..!!