అన్నాలెజినోవా వేసుకున్న ఈ డ్రెస్ అంత స్పెషలలా..? అందుకే ప్రత్యేకమైన రోజు వేసుకుందా..?

సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు బాగా బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ వాడే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజీనోవా గురించి ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్గా మారింది . గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో అన్న లేజీనోవా పేరు హైలెట్గా మారింది .

పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.. భర్త గెలిచాడు అని తెలియగానే అన్నాలజినోవో బయటకు వచ్చి ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పింది . అంతేకాదు ఏకంగా నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీకి వెళ్లింది. ఆ తర్వాత గ్రాండ్గా మెగా ఫ్యామిలీ వెల్కం చెప్పడంలోనూ హైలైట్ గా మారింది. ఈ క్రమంలోని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆమె వేసుకున్న బ్లూ డ్రెస్ హైలైట్ గా మారింది .

ఈ డ్రెస్ వెనుక పెద్ద స్టోరీ నే ఉందట.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమె బర్త డే కి సర్ప్రైజ్ గా కొనిచ్చిన గిఫ్ట్ ఇదేనట .. ఆ కారణంగానే ఆమె లైఫ్ లోనే మోస్ట్ స్పెషల్ మూమెంట్ డే నాడు వేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ డ్రెస్ అన్నాలెజినోవా కు బాగా సూట్ అయింది అంటున్నారు ఫ్యాన్స్ . పవన్ కళ్యాణ్ ఇలా కూడా భార్యను సర్ప్రైజ్ చేస్తాడా అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!