ఈ మధ్యకాలంలో 25 ఏళ్లు దాటిన అబ్బాయిలు కూడా డల్ గా నిరసించి పోతున్నారు . యంగ్ ఏజ్ లో ఉండాల్సిన స్టామినా అస్సలు ఉండడం లేదు . దానికి మెయిన్ రీజన్ ఫుడ్.. పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి సమయానికి తిండి తినకుండా ఉండడం ..తింటున్న తిండిలోనూ పౌష్టిక ఆహారం తినకుండా న్యూడిల్స్ ..ఫ్రైడ్ రైస్ అంటూ చెత్తాచెదారం తింటూ ఉండడం యువత అనారోగ్యపాలు అవ్వడానికి మెయిన్ కారణం అంటున్నారు డాక్టర్లు.
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వండుకొని తినడం కన్నా బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయట ఫుడ్స్ అన్ని బాగాచేస్తారు అని నమ్మకం లేదు.. కొన్ని కొన్ని సార్లు అయిల్ ని ఎన్నిసార్లు వాడి వాడి వాడి మళ్లీ వాడుతూనే ఉంటారు తెలిసిందే.. అలాంటి ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు .. అయితే ఈ కాలం జనరేషన్ వాళ్ళకి ఎనర్జీ ఒకప్పటిలా రావాలి అంటే రాగి జావా .. రాగి సంగటి లాంటివి తినాలి అంటూ డాక్టర్ లు సజెస్ట్ చేస్తున్నారు.
ముఖ్యంగా పడుకునే ముందు పాలల్లో ఇంట్లో చేసుకున్న నట్స్ పౌడర్ వాడితే హెల్త్ కి మంచిది అంటున్నారు. బాదంపప్పు ..పిస్తా పప్పు.. జీడిపప్పు మిక్స్ చేసుకొని పౌడర్ చేసి పాలల్లో డైలీ ఒక స్పూన్ కలుపుకొని తాగిన లేదంటే డైరెక్ట్ గా ఒక స్పూన్ తిన్న చాలా చాలా బలం అంటూ చెప్పుకొస్తున్నారు . హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది అంటూ సజెస్ట్ చేస్తున్నారు.. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ కూడా చెప్పుకు వస్తున్నారు..!!