బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రొడ్యూసర్లకు భారీ షాక్.. ఆన్ లైన్ లో ఫుల్ మూవీ స్ట్రీమింగ్..?!

సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కినము మూవీ కల్కి 2898 ఏడి. నేడు రిలీజైన ఈ మూవీ మొదటి షో తోనే పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజ్ కి ముందే ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అనేంతలా ప్రేక్షకుల్లో భారీ హైప్‌ నెలకొల్పిన మేక‌ర్స్ ఆడియ‌న్స్ అంచ‌నాల‌ను మించిపోయేల కంటెంట్‌, విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఇక ఈ సినిమా లో హీరోగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ న‌టించ‌గా అమితాబచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలో నటించారు.

దీపిక పదుకొనే, దిశాపటని హీరోయిన్గా నటించిన ఈ మూవీ మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్‌ డైరెక్షన్లో రూపొందిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం విమర్శకులతో ప్రశంసలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఫ్రీ బుకింగ్స్ తోనే రికార్డ్ సృష్టించింది. అయితే రిలీజ్ అయిన తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్ తో సినిమాపై మరింత హైప్ నెలకొంది. దీంతో టికెట్ల రేటును పట్టించుకోకుండా ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి క్రమంలో కల్కి ప్రొడ్యూసర్ల నెత్తిపై కొత్త తలనొప్పి వచ్చి పడింది.

Kalki 2898 AD Release LIVE Updates: Prabhas Delivers a Superhit, Day 1 Box Office Collection OUT - News18

భారీ బడ్జెట్లో నిర్మించి.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసిన సినిమా పాజిటివ్ టాక్ తో వెళ్ళ‌తుంది అన్న సంతోషం కాసేపైనా లేకుండానే.. ముందే కల్కి ఫుల్ లెన్త్ మూవీ ఆన్లైన్లో దర్శనం ఇవ్వడంతో మూవీ మేకర్ కు కూడా భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో పైరసీ ప్రభావం ఎంతైనా సినిమా కలెక్షన్ పై పడే అవకాశం ఉంది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు, ప్రొడ్యూస‌ర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. మూవీ రూల్స్ తో పాటు పలు ఆన్లైన్ సైట్‌ల‌లో స్ట్రీమ్ అవడం ప్రభాస్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. సినిమాను ఆన్లైన్‌లో పెట్టిన వారిని వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలంటే సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.