వామ్మో.. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్ చూశారా.. ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే..?

చేతిలో డబ్బుంటే కొండమీద కోతి అయిన దిగి వస్తుంది అని సరదాగా మాట్లాడుతుంటారు .. ఆ విషయాన్ని పక్కాగా ప్రూవ్ చేసాడు ముఖేష్ అంబానీ . తన కొడుకు పెళ్లి కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంపన్న పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే . అన్ కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈవో వీరన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ తో ఆయన వివాహం జరగబోతుంది . జూలై 12వ తేదీన వీళ్ల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది.

ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్లికి షాపింగ్ నగలు అన్నీ కూడా చాలా కాస్ట్లీ కాస్ట్లీగా కొనుగోలు చేస్తున్నారు . అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రాధిక మర్చంట్ అనంత్ అంబానీల పెళ్లి కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి అనంత్ తల్లి నీతా అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులకు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందించారు . ఈ క్రమంలోనే వాళ్ల పెళ్లి కార్డ్ కాస్ట్ హైలెట్గా మారింది .

ఆహ్వాన పత్రికను ఒక ప్రత్యేక పెట్టెలో పెట్టి మరి కళాఖండం గా తీర్చిదిద్దారు. ఎంతలా అంటే చూడగానే చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది. అనంత్ – రాధిక పేర్లలోని తొలి అక్షరాలు లైట్లు ఎరుపు రంగులతో వెడ్డింగ్ కార్డును అలంకరించారు. అంతేకాదు ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రం వినిపిస్తూ ఉండేలా డిజైన్ చేయడం హైలెట్గా మారింది . మొత్తం కూడా వెండితోనే ఈ పెళ్లి కార్డును డిజైన్ చేశారు . అంతేకాదు ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ దాదాపు 7 లక్షల పైగానే పడింది అంటూ తెలుస్తుంది . ఇందులో మూడు కేజీల వెండి దేవాలయం తో పాటు 24 క్యారెక్టర్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా చేయించారట . కేవలం పెళ్లి కార్డుల కోసమే వందల కోట్లు ఖర్చు చేశాడు ముఖేష్ అంబానీ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది..!!