“కల్కి” సినిమాలో ప్రభాస్ నటించిన భైరవ పాత్ర.. ఆ సూపర్ డూపర్ హిట్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లా ఉందే..?

“కల్కి” సినిమా చూసిన జనాలకు ఇప్పుడు ఇదే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . కల్కి సినిమాలో భైరవ క్యారెక్టర్ లో నటించిన ప్రభాస్ చాలా అద్భుతంగా నటించారు . ఆ విషయం అందరికీ తెలిసిందే .. తనదైన స్టైల్ నటించి మెప్పించారు. సినిమాకి బైరవ క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ . పాన్ ఇండియా రేంజ్ హీరో ఇలాంటి ఒక పాత్రలో కనిపించడం నిజంగా హైలైట్ విషయం అనే చెప్పాలి . కాగా ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో పాజిటివ్ వైబ్స్ తో పాటు నెగిటివ్ షేడ్స్ లో కూడా కనిపించాడు.

ఒకానొక సందర్భంలో భైరవ పాత్రలో కనిపించిన ప్రభాస్ తనకు ఏదైతే కావాలో దాని దక్కించుకోవడానికి అవతలి వాళ్లకు అన్యాయం చేయడానికి కూడా రెడీగా ఉంటాడు . మరి ముఖ్యంగా అశ్వద్ధామ పాత్రలో కనిపించిన అమితాబచ్చన్ దగ్గర ఉండే ప్రజలను కాపాడడం కోసం శత్రువులతో పోటీ చేస్తూ ఉంటాడు . అదే టైంలో భైరవకు కొన్ని ఆశలు చూపించి అతని చేత ఆ ప్రజల మీద అటాక్ చేయించినట్లుగా కూడా చూపిస్తారు .

కాగా కొన్ని కొన్ని సీన్స్ లో ప్రభాస్ లోని నెగిటివ్ యాంగిల్ను బయటపెట్టాడు నాగ్ అశ్వీన్.. అయితే సేమ్ ఇంచుమించు ఇదే మాదిరిగా గతంలో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలోనూ మనం చూడొచ్చు. మొదటగా టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ను నెగిటివ్ షేడ్స్ గానే చూపిస్తారు కానీ ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఆయనలోని పాజిటివ్ యాంగిల్ ని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారు . ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని భైరవ పాత్ర చూడగానే అందరికీ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!