పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ లెవెల్ లో హైప్ నెల్కొంది. ఎక్కడ చూసినా కల్కి మ్యానియా ఇప్పటికీ కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాలో.. అమితాబచ్చన్, దీపిక పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన మొదటి సినిమాగా ఈ సినిమా ఇప్పటికే రికార్డ్స్ సృష్టిస్తుంది. అమెరికా సహా కొన్ని దేశాల్లో ముందే ప్రీమియర్స్ పడడం.. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు టికెట్లు దక్కించుకోవడం కష్టతరమైంది. అయితే ఇలాంటి క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
అదేంటో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ప్రభాస్ అభిమానులు లాగా కల్కి టీషర్ట్ ధరించి ఫస్ట్ డే ఫస్ట్ షో కి వచ్చి సందడి చేశాడు. ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమా చూసిన ఆఖీర.. ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక ప్రధాన ద్వారం నుంచి కాకుండా పార్కింగ్ ఏరియా నుంచి థియేటర్లోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి ప్రభాస్ అభిమానులు ఆకిరా కూడా మనోడే రెబల్స్ అంటూ కల్కి టీషర్ట్ ధరించాడంటూ ట్యాగ్ చేసి వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
Akira kuda manode Rebels 🔥🔥
Kalki Tshirt 💥#Blockbusterkalki #Kalki2898AD #Prabhas pic.twitter.com/ttxTXOo8hR
— Roaring REBELS (@RoaringRebels_) June 27, 2024