ఆ ఒక్కే ఒక్క పని చేసి అందరి నోర్లు మూయించిన ప్రభాస్.. డార్లింగ్ రేంజ్ అంటే అలాగే ఉంటది మరి..!!

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ప్రభాస్ పేరు చాలా దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు వ్యక్తులు ..ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా చాలామంది తప్పు తప్పుగా ఆయన పేరుని వాడేస్తున్నారు . అయితే ప్రభాస్ అలాంటి విషయాలలో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కల్కి సినిమా విషయంలో కావాలనే ప్రభాస్ ని ఓ బ్యాచ్ గెలుకుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు ఒకే ఒక్క పని చేసి అలాంటి వాళ్ళ అందరి నోర్లు మూయించేసాడు ప్రభాస్ .

పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో అంత లో సగం దానధర్మాల ఎక్కువగా చేస్తూ ఉంటాడు. కాగా రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . కరీంనగర్ జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఇటీవల మరణించారు . అయితే ఆయన మరణ వార్తను తెలుసుకున్న ప్రభాస్ ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థిక సాయం ప్రకటించారు .

అంతేకాదు ప్రభాస్ పిఏ రామకృష్ణను శనివారం రమేష్ కుటుంబ సభ్యులకు దగ్గరికి పంపించారు . భారీ ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు ఆయన పేరిట పలు కార్యక్రమాలు చేపట్టాలి అంటూ కూడా అభిమానులకి తెలియజేశారు . ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ప్రభాస్ ఎప్పుడు కూడా అంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అని ట్రోల్ చేసే వాళ్ళకి ఇది బాగా బుద్ధి వచ్చే విషయంగా చెప్పవచ్చు.. ప్రభాస్ ట్రోలింగ్స్ ని పెద్దగా పట్టించుకోరు.. అలా అని పొగడ్తలు కూడా పట్టించుకోరు.. అందుకే ప్రభాస్ రెబల్ స్టార్ అయ్యారు .. రాజుగా ఎదిగాడు అంటున్నారు రెబల్ అభిమానులు…!