కల్కి ఈవెంట్ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం.. ఇంతలా చీట్ చేస్తారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ ఏ విషయం అయినా సరే ఇట్టే పట్టేస్తున్నారు . ఆ విషయాలను ఇట్టే ట్రెండ్ చేస్తున్నారు.. ట్రోల్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరో కి గాని హీరోయిన్ కి గాని ఏదైనా అవమానం జరిగినా వాళ్లు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడిన సోషల్ మీడియా వేదికగా స్టార్స్ ను ఏకేస్తున్నారు. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. తాజాగా డార్లింగ్ ప్రభాస్ ను కీర్తి సురేష్ ఫాన్స్ ఆడేసుకుంటున్నారు .

పక్కాగా చెప్పాలంటే ఏకిపారేస్తున్నారు . ఎందుకంటే ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈవెంట్లో ప్రభాస్ అందరి పేర్లు ప్రస్తావించారు . కానీ ఎక్కడ బుజ్జి పాత్రలో వాయిస్ ఓవర్ ఇచ్చిన కీర్తి సురేష్ పేరును మాత్రం ప్రస్తావించలేదు . ఆమెకు సంబంధించిన కామెంట్ ఏమీ చేయలేదు . దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు . ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఎంత హైలెట్గా మారిపోయిందో అందరికీ తెలిసిందే.

ఈ పాత్ర హైలెట్ అవ్వడానికి కీర్తి సురేష్ వాయిస్ కూడా కారణమంటూ చాలామంది బడా స్టార్స్ చెప్పుకొస్తున్నారు . మరి అలాంటిది… కీర్తి సురేష్ పేరు ప్రస్తావించకుండా నీ స్పీచ్ ఎలా కంప్లీట్ చేస్తావ్ అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు పలువురు ఫ్యాన్స్ ఘాటుగా ప్రభాస్ పై కౌంటర్స్ వేస్తూ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కొందరు కీర్తి సురేష్ కి ఇది ఘోరా అవమానం అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు..!!