ఎవ్వడు ఏమనుకున్నా సరే తన కొడుకుల విషయంలో తారక్ అలానే చేస్తాడా..? హ్యాట్సాఫ్ బ్రో..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే .. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల పిల్లలు ఇండస్ట్రీలోకి ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇన్నాళ్లు ఇండస్ట్రీలో రాజ్యమేలేసిన హీరోలు .. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఇండస్ట్రీలో సెటిల్ చేయడానికి ఇప్పటినుంచి బెర్త్లను కన్ఫామ్ చేసుకుంటున్నారు. పలువురు స్టార్ హీరోలు దానికి సంబంధించిన పనుల్లో బాగా బిజీ కూడా అయిపోయారు.

అయితే తాజాగా తారక్ తన కొడుకుల విషయంలో తీసుకున్న నిర్ణయం సినిమా ఇండస్ట్రీ నే కాదు సోషల్ మీడియాని సైతం షేక్ చేసి పడేస్తుంది . సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు ఒక స్టార్ హీరో కొడుకు పెద్ద స్టాల్ హీరోనే అవ్వాలి అని.. కానీ తారక ఆ విషయంలో డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. తన కొడుకులను ఇండస్ట్రీలో హీరోలుగా దింపడానికి ఏమాత్రం ఇష్టం చూపడం లేదట . తన కొడుకులు ఇద్దరిని డాక్టర్లు చేయాలి అంటూ ఇప్పటినుంచే చదువుల విషయంలో చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారట.

అంతేకాదు లక్ష్మీ ప్రణతి సైతం తారక్ డెసిషన్ కి అంగీకారం తెలపడం సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. శభాష్ అంటూ ఎన్టీఆర్ ను పొగిడేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే కొంతమంది నందమూరి ఫ్యాన్స్ మాత్రం కనీసం కొన్ని సినిమాలలోనైనా వాళ్ళని నటింప జేస్తే బాగుంటుంది అని ఆశ పడుతున్నారు . మా తారక్ అన్న కొడుకులుగా మేము తెరపై వాళ్లను చూసుకుంటాం గా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు .ఏమో మరి తారక్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో వేచి చూద్దాం..!!