ఓరి దేవుడోయ్..ఆ విషయంలో వెంకీ కూడా లిమిట్స్ క్రాస్ చేస్తున్నాడే.. కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..?

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోస్ ఎలా హద్దులు మీరిపోతున్నారో మనం బాగా చూస్తూనే ఉన్నాం. యంగ్ హీరోస్ రొమాంటిక్ సీన్స్ లో లిప్ లాక్ సీన్స్ లో నటిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంది. కానీ సీనియర్ హీరోస్ కూడా అలా హద్దులు మీరిన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చెపుతున్నారు అని తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ సమాజానికి ఉపయోగపడే సినిమాలను తెరకెక్కించాలి అనే ఆలోచన ఏ హీరోకి కూడా రాకపోతూ ఉండడం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం .

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోస్ తమ కూతుర్లు వయసు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు . తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు వెంకటేష్ . ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నాని చూస్ చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ లాస్ట్ మినిట్ లో మేకర్స్ ఆ డెసిషన్ ని వెనక్కి తీసుకున్నారట . గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరిను వెంకీ మామ సరసన నటింపజేయాలని డిసైడ్ అయ్యారట . మీనాక్షి చౌదరి – వెంకటేష్ మధ్య ఏజ్ ఎంత తేడా ఉందో మనకు తెలిసిందే. మరి అలాంటి బ్యూటీతో రొమాన్స్ అంటే కచ్చితంగా చూడడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది . మామూలుగా అయితే వెంకటేష్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోడు.. మరి ఎందుకు ఈ సినిమా విషయంలో ఆయన హద్దులు మీరడానికి ప్రయత్నిస్తున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది..!