మరోసారీ జాక్ పాట్ కొట్టిన జాన్వి కపూర్.. తారక్, చెర్రీ తో పాటు మరో భారీ టాలీవుడ్‌ ప్రాజెక్టులో ఛాన్స్..?!

దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ కు టాలీవుడ్ ఎంట్రీ తోనే దశ తిరిగిపోయింది. మొదటి సినిమానే తారక్‌ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. తన సెకండ్ ప్రాజెక్ట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో నటించే అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జాన్వీ తన మూడో సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. టాలీవుడ్ మరో భారీ ప్రాజెక్టులో జాన్వి నటించినుందని టాక్‌. ఇప్పటికే దేవరా షూటింగ్ తుది దశకు చేరింది. అయితే చరణ్‌ ఆర్ సి 16 షూటింగ్ ఇంకా పూర్తికాకముందే.. మరోసారి జాన్వీ బంప‌ర్ ఆఫ‌ర్‌ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో జాన్వీకి సక్సెస్ అందకపోయినా.. సౌత్ ఎంట్రీ తోనే ఎన్టీఆర్, చరణ్ తో పాన్ పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఈ రెండు సినిమాలతో ఎలాగైనా తన సత్తా చాటాలనే ప్రయత్నాల్లో బిజీగా ఉంది జాన్వి. బాలీవుడ్ విషయం ఎలా ఉన్నా.. సౌత్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని నిర్ణయించుకున్న ఈ అమ్మ‌డు.. ఈ క్రమంలో సౌత్ నుంచి ఎలాంటి కథలు వచ్చిన మిస్ చేయకుండా వింటుందట. అలా జాన్వి మరో బంపర్ ఆఫర్ అందుకుందని టాక్ గ‌ట్టిగా వినిపిస్తుంది. అది కూడా రాజమౌళి రూపంలో అదృష్టం వరించిందట.

Mahesh Babu and SS Rajamouli start prep for 'SSMB29' | Telugu Movie News -  Times of India

రాజమౌళి, మహేష్ కాంబో మూవీలో జాన్వి సెలెక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అడ్వెంచర్స్ మూవీగా వ‌జ్తున్న‌ సినిమాలో ఓ హీరోయిన్గా జాన్వి కనిపించనుందట. బోనికపూర్ శిఫార్స్‌తోనే రాజమౌళి.. జాన్వి కపూర్‌ను ఈ సినిమాలో తీసుకోవడానికి ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ గా దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.. ఈమె లక్‌ మామూలుగా లేదు.. వరుస జాక్పాట్ ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.