“ఫ్లాప్ అయిన కూడా నాకు ఆ సినిమా అంటేనే ఇష్టం”.. రష్మిక షాకింగ్ కామెంట్స్ వైరల్..!

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక ట్యాగ్ చేయించుకున్న బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . పెద్ద ఫిగర్ ని చెప్పలేం నటన పరంగా కూడా టూ టాలెంటెడ్ అని కూడా ఇప్పటివరకు ప్రూవ్ చేసిన సందర్భాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో కుమ్మి పడేస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటో ఆమెకే తెలియాలి ..

సోషల్ మీడియాలో రష్మిక మందన్నా లైవ్ కి వస్తే చాలు ఆమెను ఫాలో అవ్వడానికి చాలామంది జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . తాజాగా రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కొత్త అర్థాలకు దారితీస్తుంది. పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న రష్మిక మందన్నా.. చిన్న టైం దొరికిన అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది . రీసెంట్గా రష్మిక మందన్నా మాట్లాడిన మాటల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

రష్మిక మందన్నాకు తాను నటించిన సినిమాలలో ఏ మూవీ ఇష్టం అన్న ప్రశ్న ఎదురవగానే డియర్ కామ్రేడ్ అంటూ చెప్పుకు వచ్చింది . ఈ సినిమా ఎంత చెత్త కలెక్షన్స్ సాధించిందో డిజాస్టర్ టాక్ అందుకుందో మనకు తెలిసిందే. మరి అలాంటి సినిమాలు ఆమె ఫేవరెట్ అని చెప్పడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది. అంతేకాదు బహుశా విజయ్ దేవరకొండ తో నటించిన కారణంగానే ఈ సినిమా అంటే ఆమెకు ఇష్టం ఉండొచ్చు అంటున్నారు జనాలు . కారణం ఏదైనా కానీ రష్మిక మందన్నా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి . ఆమెకు విజయ్ దేవరకొండకు మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది అని ప్రూవ్ చేసేలా చేశాయి..!!