” మీతో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నా “.. తారక్ పై బాలీవుడ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాల్లో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో తాజాగా ఎన్టీఆర్ తో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా కలిసి కనిపించింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి నెటింట‌ తెగ వైరల్ గా మారింది.

వీరిద్దరూ కలిసి దిగిన ఆ పిక్ ఊర్వ‌శి స్వయంగా పోస్ట్ చేస్తూ.. గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారు. మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం అంటూ జూనియర్ ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచేసింది. త్వరలో మీతో కలిసి పని చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంటూ ట్విటర్ వేదికగా ఆమె ఓ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ‌నీ కామెంట్స్‌తో ఈ పోస్ట్ వైరల్ చేస్తున్నారు.

అయితే వీరిద్దరూ కలిసి ఒకే చోట కనిపించడంతో త్వరలోనే ఊర్వశి రౌతెల‌.. దేవర సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుందంటూ వార్త వైరల్ గా మారింది. గతంలో వాల్తేరు వైరయ్య, ఏజెంట్ సినిమాల్లో ఊర్వసి స్పెషల్ సాంగ్లో మెరిసిన సంగతి తెలిసిందే. దీంతో తారక్ దేవరలోను ఈమె ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించపోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాగా తాజాగా ఎన్టీఆర్ దేవరా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి వార్ 2 షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.