రాజమౌళి విషయంలో ఆ తప్పే నా కొంప ముంచేసింది.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్లాప్ అయిన హీరోయిన్స్ బాధలు ఎక్కువగా మనం వింటూ వస్తున్నాము. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ ఫేమస్ అవ్వడం ..అవకాశాలు దక్కించుకున్న బ్యూటీస్ కూడా ఆ తర్వాత ఫెడవుట్ అవుతూ వచ్చారు. అలాంటి లిస్టులోకే వచ్చింది అర్చన . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలుగు హీరోయిన్ అర్చన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ స్పాయిల్ అవ్వడానికి కారణం తను తీసుకున్న డెసిషన్సే అంటూ చెప్పుకొచ్చింది .

“నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో తనకు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అని చెప్పారు అని.. కానీ తీరా అది త్రిష ఫ్రెండ్ క్యారెక్టర్ గా మారిపోయింది అని అప్పటి నుంచి .. తనకు అన్ని అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి అని అందుకే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయాను అని చెప్పుకొచ్చింది “. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాలోనూ.. ఆమెకు ఇంపార్టెంట్ పాత్రను ఆఫర్ చేశారట.

అయితే ఆమె ఆ పాత్ర రిజెక్ట్ చేసిందట . శ్రీహరి గర్ల్ ఫ్రెండ్ గా నటించిన సలోని పాత్ర కోసం రాజమౌళి ముందుగా అర్చనని చూస్ చేసుకున్నారట. కానీ ఆమె చిన్న క్యారెక్టర్ కావడంతో రిజెక్ట్ చేసిందట . అదే ఆమెకు మైనస్ గా మారింది అని .. ఆ పాత్ర మిస్ చేసుకుని చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ అర్చన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!