ఆ లేడీ వల్లనే వరుణ్-లావణ్య విడాకులు తీసుకుంటారు.. బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామీ..!

తెలిసి చేస్తున్నాడో .. తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ వేణు స్వామి తీసుకున్న నిర్ణయాలు కొన్ని కొన్ని ఇబ్బందికరంగా మారుతున్నాయి . మరీ ముఖ్యంగా వేణు స్వామి స్టార్ సెలబ్రెటీస్ జాతకాలను ఓపెన్ గా బయట పెట్టేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ కపుల్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వైవాహిక జీవితంపై బిగ్ బాంబ్ పేల్చాడు.

దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి .. లావణ్య వరుణ్ ఒక లేడీ కారణంగా విడిపోబోతున్నారు అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. అది కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన లేడీ ని అంటూ బల్ల గుద్ది చెప్పారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ సంచలనంగా మారింది.

జాతకాల ప్రకారం..” వరుణ్ లావణ్యలకు అస్సలు మ్యాచ్ అవ్వదని .. పెళ్లి యోగం లేదు అని.. కానీ పెళ్లి చేసుకున్నారు అని ..అది పెద్ద మిరాకిల్ అని ..వాళ్ళ జాతకంలో గురుడు, శుక్రుడు నీచంగా ఉన్నాడు అని .. వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేదు అని తేల్చి చెప్పేశారు” వేణు స్వామి. ఆయన ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. దాదాపు మూడు నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు వేణు స్వామి . అయితే ఆ వ్యాఖ్యలను మరోసారి మెగా హేటర్స్ ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం..!