ఈసారి ఎలెక్షన్స్ లో ఎలాగైన గెలవడానికి..పవన్ అలాంటి పనులు కూడా చేస్తున్నాడా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పాలిటిక్స్ కి సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఈసారి ఎప్పుడూ లేని విధంగా టఫ్ కాంపిటీషన్ నెలకొంది అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టిడిపి – వైసిపి – జనసేన – బిజెపి పార్టీల మధ్య టాప్ కాంపిటీషన్ నెలకొంది . ఆఫ్ కోర్స్ టిడిపి – బిజెపి – జనసేన కలిసి పోటీ చేస్తున్నారు ..వైసిపిని మూడు పార్టీల సమర్థవంతంగా కలిసి ఎదుర్కోబోతున్నాయి అంటూ పలు పోల్స్ కూడా సర్వేలు కండక్ట్ చేస్తున్నాయి.

లేటెస్ట్ గా కండక్ట్ చేసిన సర్వే ప్రకారం కచ్చితంగా ఏపీలో అధికారం చేపట్టబోయేది మళ్ళీ టిడిపినే అంటూ టాక్ వినిపిస్తుంది . అయితే ఈసారి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారో అన్నదానికన్నా కూడా.. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా..? గెలవడా..? అనే విషయంపై ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉండడం గమనార్హం. సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు.

గత ఎలక్షన్స్ లో పోటీ చేశాడు ..కానీ దారుణాతి దారుణంగా ఓడిపోయారు. అయితే ఈ ఎలక్షన్స్ లో మాత్రం అలాంటి తప్పు జరగకుండా ఎలాగైనా ఆయన గెలవడానికి చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట . అందరిలాగ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోకుండా.. ప్రజలకు అవసరమైన వాటిని ఇచ్చి మనకు ఉపయోగపడే విధంగా చూస్తున్నారట . అంతేకాదు ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయి..? ఎక్కడ పవన్ కళ్యాణ్ పై నెగిటివిటీ జరుగుతుంది ..? ఎవరు అలా చేస్తున్నారు అనే దాని పై స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేశాడట..

మరి ముఖ్యంగా నిజాయితీగా కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న పేరు జనాల్లో పాతుకు పోయింది . ఈసారి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి అని డిసైడ్ అయిపోయారు పవన్ అభిమానులు . అంతేకాదు పలువురు సామాన్య జనాలు కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ కి ఛాన్స్ ఇద్దాం అని ఆలోచనలోకి వచ్చాడు. మార్పు మొదలైతే మంచిదేగా అంటున్నారు మిగతా జనాలు.. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?