భోజనం చేసిన వెంటనే అలాంటి పని చేస్తున్నారా..? చాలా చాలా ప్రమాదకరం జాగ్రత్త..!

చాలామందికి ఒక అలవాటు ఉంటుంది . తినగానే వెంటనే పడుకునేస్తారు. చేయి ఆరకముందే బెడ్ ఎక్కేస్తూ ఉంటారు . అయితే అది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అంటున్నారు డాక్టర్లు . తినగానే మన బాడీ ఏం పని చేయకుండా అదేవిధంగా పడుకునేస్తే బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా పేరుకుపోతుందట. అంతేకాదు బాడీలో బ్లడ్ సర్క్యూలేట్ అవ్వదట.. తిన్న తర్వాత కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయినా అటు ఇటు నడవడం చాలా చాలా హెల్త్ కి మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు డాక్టర్లు.

అంతేకాదు గబగబా నడవకుండా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా నడిస్తే బ్లడ్ సర్క్యూలేట్ బాగా అవుతుంది అని.. తిన్న ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు . చాలామంది నైట్ టైమ్స్ హెవీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు . బిరియానీలు.. స్టార్టర్లు అంటూ కంచం నిండా పెట్టుకుని కుమ్మేస్తూ ఉంటారు . అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు డాక్టర్లు .

మధ్యాహ్నం పూట కొంచెం హెవీగా తిన్నా పర్వాలేదు కానీ.. రాత్రి సమయంలో చాలా చాలా తక్కువగా లైట్గా ఫుడ్ తీసుకోవడం మేలు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . రాత్రి సమయంలో మరీ ముఖ్యంగా పడుకునే ఒక గంట ముందు పండ్లు తీసుకోకపోవడమే మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదైనా పండు తినాలి అనుకుంటే పడుకునే రెండు గంటల ముందే తినడం చాలా చాలా మంచిది అంటున్నారు . భోజనం చేసిన వెంటనే నిద్రపోకుండా అటు ఇటు వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిది అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!