పై ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూటీ సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఇటీవల కాలంలో త్రో బ్యాక్ థీంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీటు, స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. వారి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను ట్రెండ్ చేసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ చిన్ననాటి పిక్స్ వైరల్ గా మారాయి. ఇంత‌కీ ఈ పై ఫోటోలో తన తండ్రి తో కలిసి ఉన్న బుజ్జి పాప ఎవరో గుర్తుపట్టారా.. ఆమె సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. ఇటీవల బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడింది. ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉండే ఈ బ్యూటీ సౌత్ స్టార్ హీరోస్ అందరితోను నటించింది. బాలీవుడ్ లో కేవలం ఒక్క సినిమాలోని నటించినా ఆ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక లేడి ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ బ్యూటీ.. ఇటీవ‌ల‌ తన తండ్రి పుట్టిన రోజు కావడంతో తన తండ్రితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసుకుంది. ఇంత చెప్పాక కూడా ఆమె ఎవరో గుర్తుకు రాలేదా..? ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈమె అసలు పేరు డయానా మరియం. 1984 నవంబర్ 18న తిరువళ్ళూర్‌లోని ఓ సాధారణ క్రైస్తవ కుటుంబంలో ఈ బ్యూటీ జన్మించింది.

చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న ఈ ముద్దుగుమ్మ.. అనూహ్యంగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పాపులర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసిన నయన్ డైరెక్టర్ సత్యం అంతిక్కాడ్‌ చూసి ఆమెకు మనసినక్కర్‌లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత తమిళ్లో ఎన్నో సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అలాగే తెలుగులోనూ లక్ష్మీ, బాస్ సినిమాలో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఓ సాధారణ అమ్మాయిగా కెరీర్ ను మొదలుపెట్టి లేడీస్ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇక పాన్ ఇండియా మ్యాగజైన్ ఓక్ కవర్ పేజి పై స్ట్రాంగ్ లేడీ గా నిలిచింది.

గతేడాది అట్లీ డైరెక్షన్లో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా కోసం నయన్ రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. పలు నివేదికల ప్రకారం ఆమె దాదాపు రూ.183 కోట్లకు పైగా ఆస్తిని కలిగి ఉందని తెలుస్తుంది. ఇక ఇవే కాకుండా హైదరాబాద్, చెన్నై, కేరళ లాంటి ప్లేసులో విలాసవంతమైన సొంత భవనాలు కూడా ఆమెకు ఉన్నాయి. అలాగే ఓన్‌ జెట్ కలిగి ఉన్న ఏకైక స్టార్ హీరోయిన్ నయన్. ఓ పక్కన సినిమాలో నటిస్తూనే.. మరో పక్కన బ్రాండ్ ఎండార్స్మెంట్, సోషల్ మీడియా ప్రమోషన్స్, నైస్ స్కిన్.. చర్మ సంరక్షణ బ్రాండ్ బిజినెస్, మరోపక్క ప్రొడ్యూసర్ గాను డబ్బులు సంపాదిస్తోంది. ఇక సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకున్న నయన్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఇద్దరు కవలలు ఉన్నారు.