ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ నోట విన్న మృణాల్ ఠాగూర్ పేరు మారుమోగిపోతుంది. మొదట లవ్ సోనియా సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. పాన్ ఇండియా వైడ్ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. 2023లో నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది.
ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకోవడంతో లక్కీ బ్యూటీగా మారిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీలో నటించి మెపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక రేపు (ఏప్రిల్ 5)న ఈ సినిమా భారీ లెవెల్లో రిలీజ్ కానుంది. దీంతో పాటే బాలీవుడ్ లో పూజ మేరీ జాన్ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకముందే మృణాల్ ఠాగూర్ మరో జాక్‌పాట్ ఆఫర్ ను అందుకుందంటూ బి టౌన్ లో వార్తలు వైరల్ గా మారాయి.
తాజా సమాచారం ప్రకారం పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలి డైరెక్షన్‌లో ఓ సినిమాకు మృణాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మృణాల్ కానీ సంజయ్ లీలా భన్సాలి కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే. కాగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రీమియర్ షో లను నేడు అమెరికాలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు