వెరీ వెరీ ఇంట్రెస్టింగ్: బాలకృష్ణ గెస్ట్ రోల్‌ చేసిన సినిమా ఏంటో తెలుసా? ఎంత స్పెషల్ అంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య నటించిన గెస్ట్ రోల్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి . కెరియర్ లో ఎన్నో సినిమాలు నటించిన బాలయ్య గెస్ట్ రోల్స్ కి మాత్రం దూరంగా ఉంటారు . రీసన్ ఏంటో తెలియదు కానీ ఎప్పుడు ఎవరు అడిగినా సరే గెస్ట్ రోల్స్ చేయడానికి ఇష్టపడరు.

అలాంటి బాలయ్య తన కెరియర్ లో చేసిన ఒకే ఒక్క గెస్ట్ రోల్ కి సంబంధించిన సినిమా డీటెయిల్స్ వైరల్ గా మారాయి . ఆ మూవీ మరేదో కాదు త్రిమూర్తులు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇది. ఇందులో అర్జున్ .రాజేంద్రప్రసాద్ కూడా హీరోలుగా చేశారు . మల్టీ స్టార్లర్ మూవీ అని చెప్పొచ్చు అనుకోండి . ఈ సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్ ల్ఫ్ కనిపించారు.

కే మురళీమోహన్రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1987లో విడుదలైంది . ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీలోనే చాలా స్పెషల్ మూవీ . ఎందుకంటే చిరంజీవి – నాగార్జున కూడా గెస్ట్లుగా మెరిశారు. వీరితోపాటు ఇండస్ట్రీ మొత్తం కూడా మెరిసింది. కృష్ణ , కృష్ణం రాజు , శోభన్ బాబు, చంద్రమోహన్ , మురళీమోహన్ చాలా చాలా మంది ఈ సినిమాలో గెస్ట్లుగా మెరిశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. ప్రెసెంట్ రాజకీయాలలో బిజీగా ఉన్న బాలయ్య – బాబి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు..!