టిల్లు స్క్వేర్ స‌క్స‌స్ మీట్‌లో అనుప‌మ‌కు ఘోర‌ అవ‌మానం.. ప‌రువు తీసేశారుగా..?!

టాలీవుడ్ యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ, హోమ్లి బ్యూటీ అనుపమ పరమేశ్వర జంటగా నటించిన మూవీ టిల్లు స్క్వేర్. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్‌ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మార్చి 29న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు.. కేవలం తొమ్మిది రోజుల్లో రూ.101.4 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసింది. ఈ క్రమంలో మేకర్స్‌ ఏప్రిల్ 8న సినిమా సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.

అలాగే విశ్వక్‌సేన్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ వేడుకలు పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలో అనుపమకు ఘోర అవమానం జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అనుపమ స్టేజిపై మాట్లాడడానికి వస్తుండగా.. తారక్ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ అరుపులతో ఆడిటోరియంలో దద్దరిల్లెల చేశారట. సక్సెస్ ఆనందంలో ఉన్న అనుపమ మాట్లాడడానికి ప్రయత్నించినా.. ఆమెను మాట్లాడొద్దు అంటూ తారక్ ఫ్యాన్స్ గట్టిగా అరిచారు.

అంతేకాదు ఎన్టీఆర్ స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడాలని అనడంతో అనుపమ బాధపడి వెళ్ళిపోతుండగా.. సుమా ఆపి మాట్లాడమని అనుప‌మ‌కు మైక్ ఇచ్చిందట‌. అయినా వారు అరుస్తుండడంతో ఆమె ఇబ్బందిగా ఫీలై మూవీ టీంకు ధ‌న్య‌వాదాలు చెప్పి స్టేజ్ దిగ్గిపోయింద‌ట‌. చేసేదేంలేక‌ త్రివిక్రమ్ కాళ్లకు నమస్కరించి వెళ్ళి తన సీట్‌లో కామ్‌గా కూర్చుని పోయిందట. ఇక ఈ విషయం తెలిసిన అనుపమ ఫ్యాన్స్ తారక్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు.