ఒకే ఒక్క హిట్ తో శ్రీ లీల పోస్ట్ కు ఎసరు పెట్టిన మమిత బైజు.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంది. ఒక‌సారిగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ‌.. వరుస డ‌జ‌నుకు పైగా సినిమాలలో నటించింది. అయితే శ్రీ లీల నటించిన సినిమాలు దాదాపు ఫ్లాప్లుగా నిలవడంతో ఆమెకు మెల్లమెల్లగా మార్కెట్ తగ్గుతూ వచ్చింది. ఈ క్ర‌మంలో ప్రస్తుతం శ్రీ లీల నటించాల్సిన ఓ స్టార్ హీరో సినిమా కూడా ఆమె చేజారిపోయిందట‌.

ఇటీవల ప్రేమలు సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న యంగ్ బ్యూటీ మమత బైజు ఈ అవకాశాన్ని దక్కించుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్నానూరి డైరెక్షన్లు తెరకెక్కనున్న విజన్ నెక్స్ట్ మూవీ. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశి.. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గతంలోనే ఈ సినిమా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ పూజ కార్యక్రమాలు జరిగాయి.

ఈ ఈవెంట్లో శ్రీ లీలను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు అనౌన్స్ చేశారు. శ్రీ లీల కూడా ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో శ్రీ లీల వరుస ప్లాపులు రావడంతో సినిమా నుంచి తప్పు కుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తల్లో నిజం లేదని గ‌తంలో నాగవంశీ కొట్టివేశారు. కానీ ఇప్పుడు మరోసారి నిజంగానే శ్రీలీలను ఈ సినిమా నుంచి త‌ప్పించార‌ని.. ఆమె ప్లేస్ లో మలయాళ బ్యూటీ మ‌మితా బైజు ఎంట్రీ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో శ్రీలీల ఫ్యాన్స్ నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.