కోట్లు ఇచ్చిన ఆ గబ్బు పని చేయను అని ..తెగ్గేసి చెప్పిన సౌందర్య.. అందుకే అంత పెద్ద హీరోయిన్ అయ్యిందా..?

ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చిన తర్వాత మనకు ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది . ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తనకు ఇష్టం లేని పనులు చేయమంటూ బలవంతం చేసిన వాటికి నో చెప్పి స్టార్ హీరోయిన్గా మారింది ఓ అందాల ముద్దుగుమ్మ . ఆమె మరి ఎవరో కాదు కన్నడ బ్యూటీ సౌందర్య .

ఈ పేరు చెప్తే ఎంతమందికి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయో మనకు తెలిసిందే. ఆటోమేటిక్గా సౌందర్య పేరు చెప్పగానే అందరికీ కనీళ్ళు వచేస్తాయి . అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయితే ఎక్కడ కూడా నెగిటివిటీ.. వల్గారిటీ అనేది లేకుండా చూసుకునింది . నిజానికి సౌందర్యాని బికినీ వేయమంటూ పలువురు డైరెక్టర్ బలవంతం చేశారట .

అప్పట్లోనే కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారట . కానీ సౌందర్య అలాంటి పనిచేయనే చేయను అంటూ తగేసి చెప్పేసిందిట. బహుశా ఆమె అంత కఠినంగా ఉండడం కారణంగానే ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిందేమో అంటున్నారు అభిమానులు. అంతేకాదు సౌందర్య ఇప్పుడు మన మధ్య లేకపోయినా కోట్లాదిమంది అభిమానులకు ఇంకా ఫేవరెట్ గా ఉంది అంటే కారణం మాత్రం సౌందర్య డెడికేషన్ అనే చెప్పాలి..!!