బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తున్న టిల్లు గాడు.. ఊచకోత కోస్తున్నాడుగా..!

ఒక్కొక్క సినిమాతో కొంతమంది హీరోలు ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోస్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారిలో సిద్దు కూడా ఒకరు. డీజె టిల్లు మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన సిద్దు తాజాగా ఈ మూవీకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

పదేళ్ల క్రితం నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో చిన్న పాత్రలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సిద్దు ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. మొత్తం గా ఎన్నో కష్టాల అనంతరం సిద్ధూకు డీజే టిల్లు మూవీతో పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి ప్రేక్షకు ఆదరణ పొందింది. ఇక తాజాగా ఈ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్నే తలదన్నే విధంగా వసూళ్లను రాబడుతుంది. మొదటిరోజు రూ. 14.30 కోట్ల షేర్ రాబట్టగా 23.70 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఏక రెండవ రోజు రూ. 10.81 కోట్ల షేర్ రాబట్టగా 18.90 కోట్ల గ్రాస్ దక్కించుకుంది. ఇక మూడవరోజు కూడా రూ. 12.01 కోట్ల షేర్ నీ రాబట్టగా.. 21.01 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. అలా మూడు రోజుల్లో 39 కోట్ల షేర్ రాబట్టి చిన్న హీరోల సినిమాలను బ్రేక్ చేసింది ఈ మూవీ.