టిల్లు స్క్వేర్ పై మెగాస్టార్ కామెంట్స్.. హల్ చల్ చేస్తున్న సిద్దు పోస్ట్..!

ప్రతి చిన్న హీరో సినిమాకి కూడా చిరంజీవి తన వంతు సాయం చేస్తూ ఉంటున్న సంగతి తెలిసిందే. డబ్బు సహాయం చేయకపోయినా వారు నిర్వహించుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరవుతూ ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇక తాజాగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన మూవీ. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్ట్యున్ ఫోర్ మూవీస్ బ్యానర్లపై మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ మూవీ మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో కే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది ఈ మూవీ. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మూవీపై పొగడ్తల వర్షం కురిపించాడు. మూవీ టీం ను స్వయంగా కలిసి అభినందించిన చిరంజీవి మాట్లాడుతూ..” సిద్ధూ మా కుటుంబంలో అందరికీ ఫేవరెట్. డీజె టిల్లు మూవీ నాకెంతో ఇష్టం. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ ని కూడా చాలా ఎంజాయ్ చేశాను.

ఇది యూత్ సినిమా అని అందరూ అనుకుంటారు. కానీ ఇది యూనివర్సల్ మూవీ. ఆడియన్స్ను కడుపుబ్బ నవ్విస్తుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది ” అంటూప్రశంసించాడు చిరు. ఇక ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ..” మెగాస్టార్ చిరంజీవి గారు ఇంతగా ప్రోత్సహించినందుకు, సపోర్ట్ గా ఉన్నందుకు ధన్యవాదాలు. మా ఇన్స్పిరేషన్ మీరే ” అంటూ షేర్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.