ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్ లాక్ చేసుకున్న ” జై హనుమాన్ “.. ఎప్పుడంటే..!

2024 లో చిన్న సినిమాగా విడుదలై భారి విజయం దక్కించుకున్న సినిమాలలో హనుమాన్ మూవీ ముందుంటుంది. ఎటువంటి అంగుళాటం లేకుండా సింపుల్ గా రిలీజ్ అయి చిన్న హీరోలు కూడా మంచి సినిమాలు చేయొచ్చు అనే విషయాన్ని నిలబెట్టాడు తేజ.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కి సీక్వెల్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సీక్వెల్ పేరే జై హనుమాన్. యంగ్ హీరో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. అంతేకాకుండా ఈ సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ లో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక రీసెంట్గా తేజ సజా మరియు ప్రశాంత్ వర్మలు ఇచ్చిన హిన్స్‌ తో అయితే హనుమాన్ సీక్వెల్ నుంచి అప్డేట్ ఈ ఏప్రిల్ లోనే రాబోతున్నట్లు అర్థమవుతుంది. మరి ఈ ఉగాది కానుక గానే అవాయిడ్ జై హనుమాన్ ఫస్ట్ లుక్ రావచ్చని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు దీనికి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మరి దీని ప్రకారం జై హనుమాన్ ఫస్ట్ లుక్ ఏప్రిల్ 9న రానున్నట్లు సమాచారం. ఇక దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ భారీ సినిమాకి గౌర హరీష్ సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు.