చరణ్ బ్రదర్ తండ్రి కాబోతున్నాడా..? పండగ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది . తమ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ గుడ్ న్యూస్ చెప్తే వాళ్ళ అభిమానులు ఏ రేంజ్ లో ఫీల్ అయిపోతారో మనకు బాగా తెలిసిందే. ప్రెసెంట్ ఇప్పుడు అలాంటి ఓ స్పెషల్ రేర్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రాని.

నిక్కి గల్రాని..మలయాళ – తమిళ – కన్నడ వంటి భాషలలో స్టార్ హీరోయిన్ . చాలా చాలా సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది . తెలుగులో కూడా కృష్ణాష్టమి అనే మూవీలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకుంది కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టితో అమ్మడు ప్రేమాయణం నడిపింది అన్న విషయం అందరికీ తెలిసిందే . కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి మంచి సినిమాలో నటించి మెప్పించాడు ఆది పినిశెట్టి . మలుపు – మరకతమణి సినిమాలు ఆయన కెరియర్ లో మంచి హిట్ అయ్యాయి.

మరీ ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో ఆయనకు అన్నపాత్రలో కనిపించిన ఆది పినిశెట్టి ఇప్పటికి ఇండస్ట్రీలో రాంచరణ్ బ్రదర్ గానే గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా టైం నుంచి రామ్ చరణ్ ఆది పినిశెట్టి మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. 2022లో నిక్కీ ని ఆది పినిశెట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత వీళ్ళు తమ ఫ్యామిలీ లైఫ్ లో చక్కగా ముందుకు తీసుకెళుతున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో నిక్కి తన భర్తతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసింది .

ఆ ఫోటోలో పొట్ట కాస్త ఎత్తుగా చబ్బీగా కనిపించడంతో నిక్కీ ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఫొటోస్ చూస్తున్న వారు కూడా బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది అంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మెన్షన్ చేయలేదు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . ఆది పినిశెట్టి తండ్రి కాబోతున్నాడు అని నిక్కీ తల్లి కాబోతుంది అని బాగా వైరల్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ అందిస్తున్నారు .

అంతేకాదు మొదటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆది పినిశెట్టిని రామ్ చరణ్ బ్రదర్ గానే చూసేవాళ్ళు. ఇప్పుడు రామ్ చరణ్ బ్రదర్ తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం రూపం అందుకుంది . దీనిపై ఆది నిక్కీ స్పందిస్తేనే బాగుంటుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఈ జంట దీనిపై ఎలా స్పందిస్తారో..?