దమ్ముంటే అలా చేయండి పాన్ ఇండియా డైరెక్టర్స్.. ఫ్యాన్స్ ఓపెన్ సవాల్.. చచ్చారు పో..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ విషయాలలోనే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అలా అని మామూలు సెలబ్రిటీస్ విషయంలో ట్రోలింగ్ జరగదా ..? అంటే నో అని చెప్పాలి ఎవరి విషయంలోనైనా ట్రోలింగ్ చేస్తారు. కానీ స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు మాత్రమే బయటపడుతూ ఉంటాయి.

తాజాగా సోషల్ మీడియాలో పాన్ ఇండియా డైరెక్టర్స్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ – రాజమౌళి – సుకుమార్ ని జనాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు . టాలెంటెడ్ డైరెక్టర్ అంటే ఆల్రెడీ హిట్ కొట్టిన హీరోతో సినిమాలు తీసి హిట్టు కొట్టడం కాదు అని.. ఫ్లాప్ హీరోతో సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టడం అని.. అలా చేసినప్పుడే అది రియల్ డైరెక్షన్ అని అంటారు అని ..

మీరందరూ చూస్ చేసుకునే హీరోలు పెద్దపెద్ద హీరోలే అని.. బడా హీరోలకు ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ..ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్డ్ యాక్టర్స్ .. మరి వాళ్ళని మీరు ఏం డైరెక్ట్ చేస్తారు ..? వాళ్ళ ఫ్యాన్స్.. మీరు ఎంత చెత్త సినిమా తీసిన అది సూపర్ డూపర్ హిట్ చేస్తారు. అది మీ డైరెక్షన్ కాదు కదా..? ఫ్లాప్ హీరో తో సినిమా తీసి హిట్ కొట్టండి అంటూ ఓపెన్ సవాల్ చేస్తున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!