ఆ మాత్రం తెలియదా మెగా కోడలు పిల్లా..? ఉపాసనను ఏకేస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే..?

సోషల్ మీడియాలో ప్రెసెంట్ మెగా కోడలు ఉపాసనని ఏకీపారేస్తున్నారు జనాలు. ఎంత మంచిగా సోషల్ మీడియాలో ఉపాసన పోస్టులు పెడుతూ ఉంటుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు ఉపయోగకరమైన పోస్టులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది . పుట్టింటి నుండి ఎంత క్రేజ్ సంపాదించుకుందో అధే విధంగా అత్త ఇంటి నుండి కూడా సంపాదించుకుంది.

భర్త రాంచరణ్ కు తగిన భార్య అనిపించుకున్న ఉపాసనను ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ఏకేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి అత్తమ్మకిచెన్ అనే పేరుతో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే, సురేఖ పుట్టినరోజు నాడే ఈ మంచి కార్యక్రమానికి పూనుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఆవకాయ పెడుతున్న పోస్ట్ చేసింది .

ఇందులో ఉపాసన తన అత్తగారితోపాటు చిరంజీవి అమ్మగారితో కూడా ఫన్నీగా మాట్లాడుతుంది . లివింగ్ ఏరియా ని కిచెన్ గా చేసుకొని పచ్చడి పెడుతున్న మూమెంట్లో చిరంజీవి తల్లి అయిన అంజనమ్మను నానమ్మ అంటూ పిలుస్తుంది. అంత చదువులు చదువుకున్న గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తున్న నీకు..భర్తకు నాన్నమ్మ అయిన వ్యక్తి నీకు అమ్మమ్మ అవుతుందని కూడా తెలియదా అంటూ విమర్శిస్తున్నారు. కొంతమంది మంచిగా చెప్తుంటే మరి కొంతమంది ఏకేస్తున్నారు . సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయ్..!