100 కోట్లు తీసుకునే హీరోలు ఆ మాత్రం చేయలేరా..? కరెక్ట్ పాయింట్ పట్టేసిన ఫ్యాన్స్..!

తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు . మన తెలుగు హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారిన వారు కూడా ఉన్నారు . ప్రభాస్ – అల్లు అర్జున్ -బన్నీ- తారక్ ఒక్కోక్క సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిపోయారు . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంత బడ బడా హీరోలు ఎందుకు తెలుగు హీరోయిన్స్ తమ సినిమాలో హీరోయిన్లుగా పెట్టుకోలేకపోతున్నారు .

కన్నడ – మలయాళీ ముద్దుగుమ్మలనే తన సినిమాలో చూస్ చేసుకుంటున్నారు ..? డైరెక్టర్స్ కూడా తెలుగు బ్యూటీస్ కి చిన్న చిన్న రోల్స్ ఇచ్చి పెద్ద పెద్ద హీరోయిన్స్ పాత్రను మాత్రం వేరే ఇండస్ట్రీకి సంబంధించిన నటిమణులకు ఇస్తున్నారు.. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు . అఫ్కోర్స్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను తొక్కేస్తున్నారు అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది .

అయితే మన తెలుగు హీరోలు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తెలుగు జనాల వల్లే వీళ్ళు పాన్ ఇండియా హీరోలుగా మారారు . మరి అలాంటి వాళ్ళు తెలుగు హీరోయిన్స్ ఎంకరేజ్ చేస్తేనే కదా ..? వాళ్లు లైఫ్ లో సక్సెస్ అవ్వగలరు . తెలుగు హీరోయిన్స్ కి చిన్న పాత్రలు ఇస్తున్నారే తప్పిస్తే.. వాళ్ళని ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగనివ్వాలి అంటూ సపోర్ట్ చేస్తేనే కదా వాళ్లకి ఒక లైఫ్ ఉంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు . అయితే ఎందుకు తెలుగు బ్యూటీస్ కి హీరోయిన్స్ గా ఛాన్స్ ఇవ్వడం లేదు మన తెలుగు హీరోలు అనేది ప్రశ్నార్థకంగా మారింది..!