మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ .. రాజమౌళి సినిమా కంటే ముందే ఆ మూవీలో కనిపించబోతున్న సూపర్ స్టార్..!

ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ముగ్గురు కూడా బాలీవుడ్ హాలీవుడ్ హీరోయిన్స్ కావడం గమనార్హం.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్టార్ హీరో కూడా విలన్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట. అంతేకాదు ఇప్పుడు తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . మహేష్ బాబు రాజమౌళి సినిమా కంటే ముందే మరొక సినిమాలో కనిపించబోతున్నాడట . ఆ సినిమా మరేదో కాదు దేవర . ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది .

ఎన్టీఆర్ కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాట సహాయం చేయబోతున్నాడట మహేష్ బాబు . ఈ సినిమాలో మహేశ్ వాయిస్ వినిపించబోతుందట. సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు వాయిస్ వివరిస్తున్న కొన్ని క్లిప్స్ ను వీడియోలో యాడ్ చేయబోతున్నారట . మహేష్ బాబు రాజమౌళి సినిమా కంటే ముందే దేవర రిలీజ్ అవుతుంది . అప్పుడు మనం స్క్రీన్ పై మొదటిగా మహేష్ బాబుని రాజమౌళి దర్శకత్వంలో కంటే ముందే చూసేయొచ్చు..!!